బాలయ్య మూవీ నుండి తప్పుకున్న నయనతార.. రంగంలోకి చందమామ?
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 1960 - 70ల కాలంలోని ముంబై నేపథ్యంతో పాటు చారిత్రక అంశాల మేళవిస్తూ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు డైరెక్టర్ గోపిచంద్ .;
ఇటీవల కాలంలో ప్రత్యేకించి కొంతమంది స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో అవకాశం దక్కించుకోవడం.. కొంత భాగం షూటింగ్ చేయడం.. ఆ తర్వాత సినిమా నుండి తప్పుకోవడం లాంటివి చేస్తూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న డెకాయిట్ సినిమాలో కొంత భాగం షూటింగ్లో పాల్గొని అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది శృతిహాసన్. అయితే ఆ సినిమా విడుదలై సక్సెస్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో శృతిహాసన్ వదులుకున్న పాత్రను మృణాల్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫైనల్ అయింది.
ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు రావడంతో మళ్లీ బాలయ్య - నయనతార కాంబో సెట్ పైకి రాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశపడ్డారు. కానీ సడన్ గా నయనతార ఈ సినిమా నుండి తప్పుకోవడం అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశకు గురిచేసింది. అయితే నయనతార తప్పుకోవడం వెనుక కారణాలు ఎన్నో ఉన్నా.. ఆ స్థానంలో చందమామను రంగంలోకి దింపింది చిత్ర బృందం. మరి ఏంటా సినిమా.. సడన్ గా నయనతార తప్పుకోవడానికి కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఆరు పదుల వయసు దాటినా వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా విజయ పరంపరా కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అంటూ వరుస సినిమాలతో వరుస విజయాలతో స్టార్డంను మరింత పెంచేసుకున్నారు. ఇప్పుడు ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటు ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా ఈయన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరోసారి జతకట్టారు . ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఆ హిట్ కాంబో మళ్లీ తెరపైకి ఎన్బికె 111 అనే పేరుతో రాబోతోంది.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 1960 - 70ల కాలంలోని ముంబై నేపథ్యంతో పాటు చారిత్రక అంశాల మేళవిస్తూ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు డైరెక్టర్ గోపిచంద్ .
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే స్క్రిప్టు మార్పులు, కాల్ షీట్ సమస్యల వల్లే ఈ సినిమా నుండి నయనతార తప్పుకున్నట్లు తెలుస్తోంది.. ఇక ఇప్పుడు ఆమె స్థానంలోకి చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం . ఇదివరకే బాలయ్య - కాజల్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్ ని కొనసాగించాలని చిత్ర బృందం భావిస్తుండగా కాజల్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ రెండో షెడ్యూల్ ని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ముంబైలో భారీ సెట్టింగ్ వేసి హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.