దశాబ్దం వెనకున్న సూపర్ స్టార్...!
తాజాగా మరోసారి ఆమీర్ ఖాన్ ప్లాన్ చేస్తున్న మూవీపై విమర్శలు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఆమీర్ ట్రెండ్‌కి దూరంగా సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.;
మారుతున్న కాలంతో పాటు మనమూ మారాల్సిన అవసరం ఉంది. అలా మారకుంటే రేసులో వెనుక పడి పోవడం ఖాయం. ఈ విషయం ఆ రంగం.. ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల విషయంలోనూ నిరూపితం అయ్యింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్‌కి తగ్గట్లుగా సినిమాలు తీయలేక పోతున్న దర్శకులు కనుమరుగు అవుతున్నారు. కొత్త తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయని హీరోలు సైతం కనిపించకుండా పోతున్నారు. హీరోలు కథల ఎంపికలో చేస్తున్న తప్పిదం కారణంగా వరుస ఫ్లాప్స్‌లను చవిచూడాల్సి వస్తుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ట్రెండ్‌కు తగ్గట్లుగా సినిమాలు చేస్తేనే హిట్ కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ట్రెండ్‌కి తగ్గట్లుగా సినిమాలు చేయడం లేదని, పాత చింతకాయ పచ్చడి కథలను చేయడం వల్లే ఫ్లాప్ అవుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
బాలీవుడ్‌లో దర్శకుడిగానూ ఆమీర్ ఖాన్...
గత దశాబ్ద కాలంగా ఆమీర్ ఖాన్ వరుస ఫ్లాప్స్‌ను చవిచూస్తున్న విషయం తెల్సిందే. ఆయన దర్శకుడిగా గతంలో మంచి సినిమాలు వచ్చాయి, హీరోగా చేసిన సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. అందుకు తగ్గట్లుగా, బాలీవుడ్‌లోని ఇతర సక్సెస్ ఫుల్ హీరోల దారిలో కాకుండా పాత దారిలోనే వెళ్తానంటూ సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఆమీర్ ఖాన్ ఫ్లాప్స్‌ను చవిచూడాల్సి వస్తుంది. గతంలో ఇలాంటి సినిమాను చేసి హిట్ కొట్టాను, కనుక ఇప్పుడు మళ్లీ అదే తరహా సినిమా చేస్తాను, హిట్ కొడతాను అని ఆయన భావిస్తున్నాడు. కానీ ఆయన ఆలోచన తప్పుతోంది. ఆయన వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. తాజాగా మరోసారి ఆమీర్ ఖాన్ ప్లాన్ చేస్తున్న మూవీపై విమర్శలు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఆమీర్ ట్రెండ్‌కి దూరంగా సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
అష్నీర్ గ్రోవర్ బయోపిక్ కోసం...
ఇటీవల ఆమీర్ ఖాన్ ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ బయోపిక్‌ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఇండియాలో 2022లో భారత్ పే ఒక సంచలనంగా నిలిచింది. ఆ వెంటనే భారత్ పే డౌన్ ఫాల్ అయింది. ఆ పరిణామం నాటకీయంగా జరిగిందని, అందుకే ఆ నేపథ్యం ను తీసుకుని సినిమా తీస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఆమీర్ ఖాన్ ఈ బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన బయోపిక్‌ల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన విషయం తెల్సిందే. అయినా కూడా ఆమీర్ ఖాన్ మాత్రం మళ్లీ బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నాడు. అమీర్ ఖాన్ గతంలో చేసిన బయోపిక్ లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక మళ్లీ అదే రూట్ లో అమీర్ ఖాన్ వెళ్లే యోచన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ కాదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
ఆమీర్ ఖాన్ హీరోగా బయోపిక్...
అష్నీర్ గ్రోవర్ జీవితం గురించి కొంత మంది వ్యాపారవేత్తలకు, కొందరు సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి మాత్రమే తెలుసు. అలాంటి వ్యక్తి బయోపిక్‌ను చేయడం ద్వారా పెద్దగా హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా లేవు. అందుకే అష్నీర్ గ్రోవర్ బయోపిక్ చేసే ఆలోచన సరైనది కాదు అని పలువురు అంటున్నారు. ఆమీర్ ఖాన్ ఇంకా పదేళ్ల వెనుక ఉండి పోయాడు. అప్పుడు ఎలా ఆలోచించాడో అలాగే ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఆయన ఈతరం, జెన్ జీ తరంకి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను ఎంపిక చేసుకుంటే తప్ప హిట్ కొట్టడం సాధ్యం కాదు. 2026లో వస్తేనే ఆమీర్ ఖాన్ హిట్ కొట్టగలడు అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో ఆమీర్ ఖాన్ అష్నీర్ గ్రోవర్ బయోపిక్ తో వెళ్తాడు అనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఫలితం ఏంటి అనేది చూడాలి. ఇక అష్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో ఆయన భార్య పాత్రను బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే ఆమీర్ ఖాన్ టీం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.