ఫోటోటాక్ : రెడ్ హాట్ పాలక్ బ్యూటీ
బాలీవుడ్‌లో సహాయ దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి నముద్దుగుమ్మ పాలక్ తివారీ.;
బాలీవుడ్‌లో సహాయ దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి నముద్దుగుమ్మ పాలక్ తివారీ. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. అంతిమ్ సినిమాకు సహాయ దర్శకురాలిగా వర్క్ చేస్తున్న సమయంలోనే ఈమెలో నటిని గమనించిన కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేయమని సలహా ఇచ్చారట. దాంతో ఈ అమ్మడు మెల్లగా మోడలింగ్, యాక్టింగ్ వైపు మళ్లింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. మోడలింగ్‌లోనూ దూసుకు పోతుంది. చాలా తక్కువ సమయంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని ఈ అమ్మడు దక్కించుకుంది. హీరోయిన్స్‌కి ఏ స్థాయిలో ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఉంటారో ఆ స్థాయిలో ఈ అమ్మడికి ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమె ప్రతిభ, అందం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఈ అమ్మడు ట్రెండ్ కావడం మనం చూస్తూనే ఉన్నాం.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన...
ఇండస్ట్రీలో ఉన్న సంబంధాల కారణంగా సహాయ దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన పాలక్ తివారీ 2023లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బిజ్లీ బిజ్లీ అనే మ్యూజిక్ వీడియోను చేయడం ద్వారా మరింతగా సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక రోసీ సినిమాలో నటించిన ఈమెకు నటిగా మరింత మంచి మార్కులు దక్కాయి. సోలో హీరోయిన్‌గా సినిమాలు చేయడం కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు మోడలింగ్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ఫోటోలను, వీడియోలను షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 50 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పాలక్ తాజాగా మరో అందాల ఆరబోత ఫోటో షూట్ ను చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.
రెడ్ డ్రెస్‌లో పాలక్ తివారీ...
సాదారణంగా ముద్దుగుమ్మలు రెడ్ డ్రెస్‌లో కన్నుల విందు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక పాలక్ తివారీ అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేయడం ద్వారా కన్నుల పండుగ అన్నట్లుగా ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ పాలక్ తివారీ సొంతం. అందుకే ఈ రెడ్ డ్రెస్‌లో అంతకు మించి అన్నట్లుగా అందంగా, ఆకర్షణీయంగా పాలక్ కనిపిస్తోందని నెటిజన్స్, ముఖ్యంగా ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ పాలక్ అందాల ఆరబోత ఫోటోలు, మోడలింగ్ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ స్థాయిలో ఆ ఫోటోలు అందంగా కనిపించలేదని, ఈసారి రెడ్ హాట్ అన్నట్లుగా అనిపిస్తోంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ఈ అమ్మడికి ఎందుకు బాలీవుడ్ నుంచి బల్క్ ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీం ఖాన్‌తో పాలక్ ప్రేమాయణం...
శ్వేతా తివారీ, రాజా చౌదరి ల కుమార్తె అయిన పాలక్ తివారీ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉండటం వల్ల సహజంగానే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అందుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్లు పాలక్ తివారీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ముంబైలోని మిథిబాయి కళాశాల నుంచి సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన పాలక్ 2024 లో ఇబ్రహీం ఖాన్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రేమ విషయాన్ని ఇద్దరూ రహస్యంగా ఉంచుతూ వచ్చారు. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు వీరి ఫోటోలు, వీడియోలు షేర్ కావడంతో ఇద్దరి మధ్య దూరం చాలా తగ్గిందని, ఇద్దరు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారనే పుకార్లు మరింతగా వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయమై పాలక్ తివారీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.