ఆడిషన్ అని రేప్ చేయబోయారు..యంగ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-04-09 11:10 GMT
మీటూ.. ఇండియాలో ఇండస్ట్రీ ఏదైనా కూడా హీరోయిన్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. ఎప్పుడు చూసినా ఇప్పుడు హీరోయిన్స్ కంటనీరు పెట్టే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో తాను ఓ ఆడిషన్‌ కు వెళ్తే ఆ దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెబుతుంది బాలీవుడ్ హీరోయిన్ మాన్వీ గాగ్రూ. ఈమె కొన్ని హిందీ సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేసింది. తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఈమె. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది మాన్వి. ఓ సినిమాలో అవకాశం కోసం తాను ఆడిషన్స్‌ కు వెళ్లానని.. చెత్తగా ఉన్న ఓ ఆఫీసు లో తనను అత్యాచారయత్నం సన్నివేశం లో నటించమని అడిగారని చెప్పింది మాన్వి.

అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారట. వెంటనే వాతావరణం చూసినపుడే తేడా కొట్టిందని తెలిపింది. ఆ గదిలో పడక మంచం కూడా ఉందని.. అది చూసినపుడే అక్కడ్నుంచి భయంతో వెంటనే బయటికి వచ్చేసానని చెప్పింది ముద్దుగుమ్మ. ఆ మంచం.. రేప్ సీన్ ఇవన్నీ తలుచుకుంటే తనకు భయంతో నిద్ర కూడా రాదని చెబుతుంది మాన్వి. ఉజ్డా చమన్‌ సినిమాతో మాన్వి గాగ్రూ గుర్తింపు తెచ్చుకొంది. ఈ బ్యూటీ టీవీ షో 'ధూమ్ మచావో ధూమ్' తో తన కెరీర్ మొదలుపెట్టారు. 'ట్రిప్లింగ్' - 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. మొత్తానికి మీటూపై ఇన్ని కథనాలు బయటికి వస్తున్నా కూడా ఎవరూ పెద్దగా స్పందించకపోవడం ఆశ్చర్యకరం.
Tags:    

Similar News