• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'త్రివిక్రమ్'తో ముచ్చటగా...

'త్రివిక్రమ్'తో ముచ్చటగా మూడోసారి.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..??

By - Tupaki Desk
Update: 2021-06-02 00:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరుగా స్థానం సంపాదించుకున్నాడు తమన్. ఈ మధ్యకాలంలో తమన్ సంగీతంకు జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే ప్రేక్షకుల టేస్ట్ తో పాటు అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తమన్ సంగీతం అందిస్తున్నాడు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు తమన్ అందించే పాటలతో పాటు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజిలో ఊపేస్తున్నాయి. ఈ విషయం ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేసాడు తమన్. గతేడాది అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్ ఒక్కసారిగా మ్యూజిక్ స్టైల్ కూడా మార్చేసాడు. నిజానికి తమన్.. సినిమా కథను బట్టి మ్యూజిక్ అటు మాస్ ఇటు క్లాస్ అన్ని అంశాలను మిక్స్ చేస్తున్నాడు.

ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్ పరంగా.. బాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా తమన్ చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నాడు. అందుకే ఆ రేంజిలో ఆల్బమ్స్ హిట్ అవుతున్నాయి. అంతకన్నా ముఖ్యంగా బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల మైండ్ లోకి అలా దూసుకెళ్తుంది. అయితే తమన్ సాంగ్స్ కంటే బాక్గ్రౌండ్ మ్యూజిక్ కు ఫ్యాన్ బేస్ చాలా ఉంది. వరుసగా హిట్స్ పడేసరికి తమన్ కూడా కమర్షియల్ బాట పట్టినట్లు టాక్ నడుస్తుంది. మొన్నటివరకు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క అన్నట్లుగా ట్రెండీ మ్యూజిక్ ఇస్తున్నాడు.

మరి ఈ ఏడాది ఆల్రెడీ తమన్ క్రాక్ - వకీల్ సాబ్ లాంటి మాస్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం తమన్ చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీ అయిపోయాడు. ఓవైపు మహేష్ బాబుకు వరుసగా సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలకు అందిస్తున్నాడు. అలాగే నందమూరి బాలయ్య అఖండ సినిమాలతో పాటు భారీ సినిమాలను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ - మహేష్ సినిమాను మాత్రం ఇటీవలే తమన్ స్వయంగా కన్ఫర్మ్ చేసాడు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవిందసమేత - అలవైకుంఠపురంలో ఆల్బమ్స్ భారీ హిట్ అయ్యేసరికి ఇద్దరి మధ్య మంచి ర్యాపో కుదిరిందని చెబుతున్నారు. మరి ఈసారి ఈ కాంబినేషన్ లో మరో మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
Tags:    
  • SS Thaman 
  • Trivikram 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS