స్టార్ హీరో టీజర్‌ తో ఇరగదీశాడు

Update: 2016-02-05 04:18 GMT
తమిళంలో రజినీకాంత్ తర్వాత అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరో విజయే. అతడి సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ షేకైపోతుంది. ‘పులి’ లాంటి డిజాస్టర్ మూవీతో కూడా రూ.100 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టాడంటే విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. విజయ్ కొత్త సినిమా రాబోతుందనగా అతడి అభిమానుల సందడి మామూలుగా ఉండదు. ‘పులి’ తర్వాత విజయ్ నటిస్తున్న ‘తెరి’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుంచి చాలా హంగామా చేస్తున్నారు ఇళయదళపతి ఫ్యాన్స్. ఇప్పుడిక ఆ సినిమా టీజర్ కూడా వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ‘తెరి’ టీజర్ ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.

ఈ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నిమిషంలో లోపే ఉన్న ఈ టీజర్ లో విజయ్ తనదైన శైలిలో అలరించాడు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. సినిమా కథేంటన్న హింట్ ఏమీ ఇవ్వలేదు కానీ.. ఇది పవర్ ప్యాక్డ్ పోలీస్ మూవీ అని మాత్రం అర్థమైంది. విజయ్ ఇందులో రెండు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఒక పాత్రకు పిలక కూడా ఉంది. టీజర్ అంతా కూడా విజయే కనిపించాడు. హీరోయిన్ సమంతకు టీజర్లో ప్లేసివ్వలేదు. ఇంకెవ్వరూ కూడా కనిపించలేదు. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉన్నట్లున్నాయి. ‘రాజా రాణి’ లాంటి క్లాస్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమైన అత్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అతడి తొలి సినిమాకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది ‘తెరి’. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Full View

Tags:    

Similar News