• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌వ‌ర్ స్టార్ ని...

ప‌వ‌ర్ స్టార్ ని న‌వ్వించిన ట్రైల‌ర్‌!

By - Tupaki Desk
Update: 2022-08-12 10:34 GMT
ప‌లాస 1978, శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ చిత్రాలతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేస‌కున్నారు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. ఈ రెండు సినిమాల త‌రువాత ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం'క‌ళాపురం'. జీ స్టూడియోస్‌, ఆర్ 4 ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

ఇక్క‌డ అంద‌రూ క‌ళాకారులే అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్‌. ఇదొక మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నుషుల క‌థ‌. ప్ర‌స్తుత సమాజంపై సెటైరిక‌ల్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో స‌త్యం రాజేష్‌, సంచిత పూనాచ‌, కాషిమ ర‌ఫీ, చిత్రం శ్రీ‌ను, రుద్ర‌, ఆంటోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైల‌ర్ ని శుక్ర‌వారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ట్యాబ్ లో ట్రైల‌ర్ ని విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్రైల‌ర్ చూస్తూ న‌వ్వుల్లో మునిగితేలారు. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ ఓ మూవీ ట్రైల‌ర్ చూస్తూ న‌వ్వ‌డం ఇదే కావ‌డం విశేషం అని చిత్ర బృందం ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

ఇటీవ‌ల జ్వ‌రం రావ‌డంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ప‌వ‌న్ తొలిసారి ఓ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం విశేషం. ఇదిలా వుంటే 'క‌ళాపురం' మూవీ మొత్తం క‌రీంన‌గ‌ర్ లోని ధ‌ర్మ‌పురి నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది.

ధ‌ర్మ‌పురిలో 42 రోజులు పాటు షూటింగ్ చేశార‌ట‌. ఈ నెల 26న ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆత్యంతం ఆస్య‌భ‌రితంగా సాగే సెటైరిక‌ల్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌బోతోంది.


Full View
Tags:    
  • PowerStarPawanKalyan 
  • KalapuramTralier 
  • Palsa1978 
  • SriDeviSodaCenter 
  • ZeeStudious 
  • SatyamRajesh 
  • MovieNews 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS