అభిమాని గృహ ప్రవేశంకు హాజరైన సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ వృద్దాప్యంతో పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నా కూడా ఆయన తన సన్నిహితులు మరియు అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటున్నారు. తాజాగా కృష్ణ అభిమాని ఒకరు నూతన గృహ ప్రవేశం చేసిన సందర్బంగా వారిని ఆశీర్వదించేందుకు కృష్ణ స్వయంగా వెళ్లారు. సుదీర్ఘ కాలంగా కృష్ణకు అభిమాని అవ్వడంతో పాటు పద్మాలయ స్టూడియోస్ లో పీఆర్ గా పనిచేస్తున్న జొన్నవిత్తుల పద్మజ బాలాజీ దంపతులను ఆశీర్వదించేందుకు వెళ్లారు. కృష్ణ గారు తన గృహ ప్రవేశ కార్యక్రమంకు రావడం పట్ల చాలా ఆనందంను జొన్నవిత్తుల వ్యక్తం చేశాడు.
పద్మాలయ సిబ్బందితో పాటు కృష్ణ ఫ్యామిలీకి చెందిన మరి కొందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణ అభిమానుల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు అనేందుకు ఇదే నిదర్శణం అంటూ అభిమానులు అంటున్నారు. ఆయన మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అంటూ అభిమానులు పేర్కొన్నారు. అభిమానులను ఎప్పుడు కాపాడుకుంటూ రావడంతో పాటు తనను నమ్ముకున్న వారికి సాయంగా నిలవడం ఆయన ప్రత్యేకత అంటూ అభిమానులు కృష్ణ గొప్పతనంను ప్రశంసిస్తున్నారు.