ఇల్లు అమ్మేస్తున్నారనే వార్తలపై సరదాగా స్పందించిన సూపర్‌ స్టార్‌

Update: 2020-10-28 09:30 GMT
బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ గత కొన్ని సంవత్సరాలుగా సినీ కెరీర్‌ పరంగా నిర్మాతగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన నిర్మించిన సినిమాలు నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన అత్యంత ఖరీదైన ఇల్లు మన్నత్‌ ను అమ్మేసేందుకు రెడీ అయ్యాడు అంటూ పుకార్లు మొదలు అయ్యాయి. షారుఖ్‌ మన్నత్‌ విలువ ప్రస్తుతం రూ.250 కోట్లుగా ఉందని ముంబయి మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆ మొత్తంతో మళ్లీ తాను ఆర్థికంగా సెటిల్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో షారుఖ్‌ ఖాన్‌ అభిమానులతో చిట్‌ చాట్‌ చేశాడు. చిట్‌ చాట్‌ సందర్బంగా మన్నత్‌ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.

ఆస్క్‌ షారుఖ్‌ చిట్‌ చాట్‌ సందర్బంగా ఒక వ్యక్తి భయ్యా మీరు మన్నత్‌ ను అమ్మేసేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అంటూ ప్రశ్నించాడు. అందుకు షారుఖ్‌ చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. మన్నత్‌ అంటే వాగ్దానం. అందువల్ల షారుఖ్‌ మన్నత్‌ అనేది ఎవరు కొనలేరు అమ్మలేరు. దాన్ని ఒకరి నుండి ఒకరు తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప అమ్మకం కొనడం జరగదని సరదాగా అన్నాడు. ఇంతకు అసలు విషయాన్ని మాత్రం షారుఖ్‌ క్లారిటీ ఇవ్వలేదు. షారుఖ్‌ అంత లైట్‌ గా స్పందించాడు కనుక ఖచ్చితంగా మన్నత్‌ ను షారుఖ్ అమ్మే అవకాశం లేదని అంటున్నారు.

షారుఖ్‌ దంపతులు ఎంతో ఇష్టపడి చాలా ఖరీదు పెట్టి ఆ భవనంను కొనుగోలు చేశారు. ఆ ఇంటిని ఎంతో ఆప్యాయంగా షారుఖ్‌ చూసుకుంటాడు. వాతావరణ కాలుష్యం నుండి కాపాడేందుకు దాన్ని ప్రతి ఏడాది కవర్‌ తో కప్పేయిస్తాడు. అలాంటి భవనంను షారుఖ్‌ ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్ముతాడు అంటే నమ్మశక్యంగా లేదు అంటున్నారు. బాలీవుడ్‌ వర్గాల వారు కూడా మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటున్నారు. మన్నత్‌ ను షారుఖ్‌ అమ్మక పోవచ్చు అనేది అందరి మాట.
Tags:    

Similar News