న్యూ ఇయర్‌ వేడుకలకు విమానం ఎక్కేసిన స్టార్‌ కపుల్‌

Update: 2020-12-29 13:30 GMT
బాలీవుడ్‌ స్టార్స్‌ న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఇప్పటి నుండే ప్లాన్‌ చేసుకుంటూ ఉన్నారు. కొందరు ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనబోతున్నారు. కొందరు విదేశాలకు వెళ్తున్నారు. సెలబ్రెటీలు కొత్త సంవత్సరం సందర్బంగా కార్యక్రమాల్లో పాల్గొంటే కోట్లల్లో పారితోషికాలు అందుకునే అవకాశం ఉంటుంది. కాని ఈసారి కరోనా కారణంగా పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు ఇచ్చే అవకాశం లేదు. కనుక న్యూ ఇయర్‌ వేడుకలు ఇండియాలో కండీషన్స్‌ మద్య ఉండే అవకాశం ఉంది కనుక బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపిక రన్వీర్‌ లు విదేశాలకు చెక్కేశారు.

వీరిద్దరు ముంబయి ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించారు. ఇద్దరు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రస్‌ లతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఎయిర్‌ పోర్ట్ లో వారు నడుచుకుంటూ వెళ్తుంటే అందరు కూడా వారినే చూస్తూ ఉండి పోయారు. దీపిక పదుకునే తన ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌ ను పట్టుకుని అలా ఎయిర్ పోర్ట్‌ లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె రాయల్టీ కనిపిస్తుంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News