ప్రియుడికి కరోనా సోకిన మరుసటి రోజే స్టార్ హీరోయిన్ కు పాజిటివ్..!

Update: 2021-04-06 12:17 GMT
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. ఇక బాలీవుడ్ లను మహమ్మారి గడగడలాడిస్తోంది. సినీ ప్రముఖులంతా వరుసపెట్టి కరోనా గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే మనోజ్‌ బాజ్‌ పాయ్‌ - రణబీర్‌ కపూర్ - అమీర్‌ ఖాన్‌ - పరేష్‌ రావల్‌ - ఆలియాభట్‌ - అక్షయ్‌ కుమార్ - కార్తీక్ ఆర్యన్ - భూమి పెడ్నేకర్‌ తదితరులు కోవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

కత్రినా కైఫ్ తో పాటుగా ఆమె సోదరి ఇసబెల్లె కైఫ్ కు కూడా కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రీసెంటుగా కత్రినా సోదరి ఇసాబెల్లె కైఫ్‌ తో కలిసి డిన్నర్ కోసం బాంద్రాకు వచ్చి తిరిగినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే కత్రినా ప్రియుడిగా భావిస్తున్న బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ కు కరోనా సోకిన మరుసటి రోజే ఆమెకు కోవిడ్ అని తేలడం చర్చనీయాంశంగా మారింది. విక్కీ కౌశల్ తనకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నానని.. ఈ మధ్యకాలంలో తనకు కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని చెబుతూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇచ్చారు.


Tags:    

Similar News