థియేటర్స్ తెరుచుకున్న వెంటనే సినిమా రిలీజ్ అంట!

Update: 2021-06-08 12:31 GMT
ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీ కొత్త జానర్లకు - వైవిధ్యమైన సినిమాలకు తావిస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి నూతన దర్శకులు కొత్త కథలు కథనాలతో సినిమాలు రూపొందిస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీకి 'నీది నాది ఒకే కథ' అనే సినిమాతో దర్శకుడుగా కెరీర్ ప్రారంభించాడు వేణు ఊడుగుల. మొదటి సినిమానే మంచి విజయం సాధించి విమర్శకుల నుండి ప్రశంసలు తీసుకొచ్చింది. ఇప్పుడు వేణు దర్శకత్వంలో సెకండ్ మూవీగా విరాటపర్వం రూపొందించాడు. స్టార్ యాక్టర్స్ రానా - నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ తీరా విడుదల సమయానికి కరోనా కారణంగా బ్రేక్ పడింది.

కరోనా మహమ్మారి వలన థియేటర్స్ మూతపడి సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఓకే వాయిదా పడింది త్వరలోనే మరో డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందిలే అనుకునే లోపల విరాటపర్వం సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుందని పుకార్లు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ మధ్యలో హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజు నుండి పుకార్లు మరింత జోరందుకున్నాయి. కానీ అప్పటికే విరాటపర్వం మేకర్స్ ఈ సినిమా పై వస్తున్నా పుకార్లకు చెక్ పెట్టేసారు. విరాటపర్వం సినిమా ఖచ్చితంగా థియేట్రికల్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. విరాటపర్వం థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్ రైట్స్ - తెలుగు సాటిలైట్ రైట్స్ - హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నికూడా డిస్ట్రిబ్యూటర్ లకు అమ్ముడైనట్లు మేకర్స్ తెలిపారు.

అలా సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేసారు. అయితే రిలీజ్ ముందే సినిమా హక్కులే మేకర్స్ కు లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా కరోనా పరిస్థితి తొలగిపోయాక చెబుతామని తెలిపారు. ఈ సినిమా 1990 కాలంనాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా రూపొందింది. తాజాగా ఈ సినిమాను జులైలో థియేటర్స్ ఓపెన్ కాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో ప్రియమణి, నివేత పేతురాజ్, నందిత దాస్ ప్రధానపాత్రలలో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News