వాళ్లు చూడటం వల్లే మార్కెట్ పెరిగింది: అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అటు ఇండస్ట్రీ వారి నుండి ఇటు అభిమానుల నుండి పెద్దఎత్తున గ్రీటింగ్స్ అందుకున్నాడు బన్నీ. అయితే గతరాత్రి మోస్ట్ అవెయిటింగ్ ఫిల్మ్ పుష్ప నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టైలిష్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే టీజర్ విడుదల చేసిన సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. అది తమిళ, మలయాళం, కన్నడ, నార్త్ లేదా ఇతర దేశాలలో ఉన్నవారందరికి థాంక్స్.
ఎందుకంటే మీరు తెలుగు సినిమాలు చూడటం వల్లనే తెలుగు మార్కెట్ పెరిగింది. ఇది కేవలం మీవల్లే సాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున బన్నీ ఇంటివద్దకు చేరుకున్నారు. వారందరి అరుపులు వినిపించి బయటికి వచ్చిన బన్నీ.. అభివాదం చేసి అందరికి థాంక్యూ చెప్పాడు. అలాగే అభిమానులు బహుమానంగా అందించిన మొక్కలను అందుకున్నాడు. ఫ్యాన్స్ కోసం తగ్గేదే లే అనే డైలాగ్ వినిపిచి వారిని ఖుషీ చేసాడు. అయితే బన్నీని చూసి విష్ చేసేందుకు అభిమానులు మాత్రం వీధుల్లో నిండిపోయారు. ఇక పుష్ప సినిమా ఆగష్టు 13న విడుదల అవుతుండగా.. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ కాగా డిఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప ఇంట్రడక్షన్ వీడియోతో సినిమా పై అంచనాలు మాత్రం భారీస్థాయికి చేరుకున్నాయి.