14 మిలియన్లు.. దుమ్ములేపిన ప్రభాస్

Update: 2020-06-06 06:30 GMT
టాలీవుడ్ లో స్టార్లు చాలమందే ఉన్నారు కానీ వారందరూ ఒక ఎత్తు ప్రభాస్ ఒక ఎత్తు.  అంటే హైట్ లోనే అనుకునేరు.. చాలా విషయాలలో.  సినిమా బడ్జెట్.. రెమ్యూనరేషన్.. పాన్ ఇండియా ఫాలోయింగ్ ఇలా ఏ విషయంలో కూడా ప్రభాస్ ఒక మెట్టు పైనే ఉంటాడు. అయితే అదేంటో కానీ డార్లింగ్ వాటిని తన పీఆర్ టీం చేత ఊదరగొట్టించకుండా.. తనపని తను చేసుకుంటూ పోతుంటాడు.

ఇన్ని ఘనతలున్న ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించాడు.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి ఫాలోయర్ల సంఖ్య 14 మిలియన్లు దాటింది. సౌత్ ఇండియా మొత్తం మీద ఇంత ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్ ఒక్కరే.  ఇతర తెలుగు స్టార్ హీరోల ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

అల్లు అర్జున్: 13.1 మిలియన్లు
మహేష్ బాబు:  7.97 మిలియన్లు
రామ్ చరణ్: 7.1 మిలియన్లు
నాని: 5.2 మిలియన్లు

'బాహుబలి' రెండు భాగాలు ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ క్రేజ్ భారీగా పెరిగింది. 'సాహో' సౌత్ లో నిరాశపరిచినప్పటికీ నార్త్ లో మాత్రం విజయం సాధించింది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.
Tags:    

Similar News