మరో నటితో విజయ్ కి వివాహేతర సంబంధం.. భార్య ఆరోపణలు?
అసలు ఈ గొడవ వెనుక ఉన్న కారణాలేంటి? సంగీత ఆరోపణల్లో నిజమెంత? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాలలోకి వెళితే..;
కోలీవుడ్ దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెను తుఫానులా మారింది. 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఆయన భార్య సంగీత విడాకులు కోరడమే కాకుండా, విజయ్‌పై సంచలన ఆరోపణలు చేయడం తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక నటితో వివాహేతర సంబంధం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు వస్తున్న వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. అసలు ఈ గొడవ వెనుక ఉన్న కారణాలేంటి? సంగీత ఆరోపణల్లో నిజమెంత? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాలలోకి వెళితే..
ఆ నటితో అఫైర్.. సంగీత సంచలన ఆరోపణలు:
విజయ్, సంగీతల మధ్య గొడవలకు ఒక స్టార్ హీరోయిన్ కారణమని గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్ ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. సంగీత తన విడాకుల పిటిషన్‌లో విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని నేరుగా ఆరోపించినట్లు సమాచారం. 2021లోనే ఈ విషయం తనకు తెలిసిందని, ఆ సమయంలో విజయ్ ఇకపై అలాంటివి జరగవని హామీ ఇచ్చినప్పటికీ, తన పద్ధతి మార్చుకోలేదని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఇక పదే పదే తన నమ్మకాన్ని వమ్ము చేస్తూ, మళ్ళీ అదే సంబంధాన్ని కొనసాగించడం వల్లే తాను తీవ్ర మానసిక బాధకు గురయ్యానని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పిటిషన్‌లో వివరించినట్టు తెలుస్తుంది.
కోర్టు నోటీసులు:
ఇక సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రత్యేక వివాహ చట్టంలోని కొన్ని సెక్షన్స్ కింద విడాకులు కోరడం గమనార్హం. ఇవి ప్రధానంగా వివాహేతర సంబంధం, క్రూరత్వాన్ని సూచిస్తాయి. విజయ్ తన పట్ల క్రూరంగా వ్యవహరించారని, పెళ్లి మీద గౌరవం లేకుండా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఇక ఈ పిటిషన్‌ను స్వీకరించిన చెంగల్‌పట్టు కోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 20న విచారణకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లయిన 26 ఏళ్ల తర్వాత, పిల్లలు పెద్దయ్యాక ఇలాంటి ఆరోపణలతో సంగీత కోర్టుకెక్కిందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు తమిళ సినీ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం.. నిజమేనా లేక కుట్రనా:
విజయ్ తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. సరిగ్గా ప్రచార పర్వం ఊపందుకుంటున్న సమయంలో ఈ విడాకుల వ్యవహారం బయటకు రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు కూడా విజయ్ అఫైర్ నుంచీ బయటకు రావాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే, విజయ్ అభిమానులు మాత్రం ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయ కుట్ర అని కొట్టిపారేస్తున్నారు. ఇక ఏది ఏమైనా విజయ్ ఫ్యామిలీ తరఫున అధికారిక స్పందన వస్తే తప్ప ఈ వివాదంపై పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు.