సూపర్ స్టార్ కూతురు క్లీనికల్లీ డిప్రెస్డ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి చెందిన తర్వాత పలువురు స్టార్స్ డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. సుశాంత్ డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా బాలీవుడ్ వర్గాల వారు బలంగా నమ్ముతున్నారు. ఆయన గత కొన్నాళ్లుగా డిప్రెషన్ తగ్గించుకోవడం కోసం మెడిసిన్ కూడా తీసుకుంటున్నారు. అందుకే ఆయన మృతికి డిప్రెషన్ కారణం అంటున్నారు. ఇదే సమయంలో చాలా మంది తమకు కూడా డిప్రెషన్ ఉందని.. చాలా సార్లు ఆత్మహత్య వరకు వెళ్లామంటూ చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా తాను డిప్రెస్డ్ అంటూ చెప్పుకొచ్చింది.
కొన్నాళ్ల క్రితం తాను చాలా మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉండేదాన్ని ఆ సమయంలోనే నేను క్లినికల్లీ డిప్రెస్డ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆ సమయంలో సన్నిహితుల సహకారంతో చాలా స్పీడ్ గా డిప్రెషన్ నుండి బయట పడ్డాను. మనసులో ఏదైనా దాచుకుంటే చాలా డిప్రెషన్ కు గురి అవ్వాల్సి వస్తుంది. మనసు పూర్తిగా ఓపెన్ గా ఉంటే డిప్రెషన్ అనేది ఉండదు. మనసులో ఏం పెట్టుకోకుండా మీ వారికి చెప్పండి అంటూ తనకు తోచిన సలహాలను ఇరా ఖాన్ చెప్పింది. నిజంగానే మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మనసులో ఏం పెట్టుకోకుండా ఓపెన్ గా చెప్పడం వల్ల చాలా డిప్రెషన్ తగ్గుతుంది. ఇది క్లీనికల్ గా కూడా నిర్థారణ అయ్యింది.