• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్‌ కు సీక్వెల్‌.....

ట్రైలర్‌ కు సీక్వెల్‌.. అదిరింది కాన్సెప్ట్‌

By - Tupaki Desk
Update: 2020-02-12 12:00 GMT
తాప్సి.. రామ్‌ కుమార్‌.. కుముద్‌ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘థప్పడ్‌’ ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు వారాల క్రితం ఈ చిత్రం ట్రైలర్‌ ను విడుదల చేశారు. ట్రైలర్‌ లోనే సినిమా కథ అంతా చెప్పేశారు. సినిమా నేపథ్యం ఏంటీ.. ఏ విధంగా ఈ చిత్రం సాగుతుందనే విషయంపై ట్రైలర్‌ లో ఫుల్‌ క్లారిటీ ఇచ్చి కూడా సినిమాపై జనాల్లో ఆసక్తిని కలిగించేలా చేశారు. చాలా అన్యోన్యంగా ఉండే భార్య భర్తల మద్య ఒక చెంప దెబ్బ విడాకుల వరకు వెళ్లింది. తనను నలుగురిలో కొట్టిన భర్త నుండి విడాకులు కోరుతుంది తాప్సి. విడాకుల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఏంటీ అనేది సినిమా.

ట్రైలర్‌ కు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ట్రైలర్‌ లో తాప్సి నటన చాలా బాగుంది అంటూ కామెంట్స్‌ వచ్చాయి. కేంద్ర మంత్రి ఇరానీ కూడా ఈ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన నేపథ్యం లో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ ట్రైలర్‌ కు సీక్వెల్‌ అన్నట్లుగా మరో ట్రైలర్‌ ను తీసుకు వచ్చారు. ట్రైలర్‌ 2 ను చాలా విభిన్నంగా చూపించారు. తాప్సిని భర్త చెంప దెబ్బ కొట్టడం చూపించి ఆ తర్వాత తాప్సి మాట్లాడుతూ తర్వాత సీన్‌ కోసం చూస్తున్నారా. ఇలాంటి చెంప దెబ్బలను నేను సహించను మీరు కూడా సంహించకండి అంటూ ఒక సందేశం ఇచ్చింది.

ఇలాంటి చెంపదెబ్బ వీడియో ఇండియాలోనే అత్యధిక రిపోర్ట్‌ లు పొందిన వీడియోగా నిలవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను యూట్యూబ్‌ కు రిపోర్ట్‌ చేయండి అంటూ చెప్పుకొచ్చింది. చెంపదెబ్బ వీడియోను రిపోర్ట్‌ చేయండి అంటూ తాప్సి చేసిన ప్రకటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా పై మరింత ఆసక్తి ని కలిగించడం తో పాటు సినిమా గురించి జనాల్లో చర్చ జరిగేలా చేశారు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తో తాప్సి మరో సక్సెస్‌ ను అందుకోవడం తో ఈ చిత్రం లో నటన కు అవార్డును కూడా దక్కించుకోబోతుందంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.


Full View
Tags:    
  • Tapsee Pannu 
  • Tapsee Latest Pics 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS