నా పట్ల ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: మహేష్

Update: 2021-08-09 16:07 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (ఆగస్ట్ 9) ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. ఫ్యాన్స్ తో పాటుగా తోటి నటీనటులు, సినీ రాజకీయ ప్రముఖులు మహేష్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' టీజర్ మిలియన్ల వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ తనకు విషెస్ అందించిన వారందరికీ ట్విట్టర్ లో రిప్లై ఇస్తూ వస్తున్నారు.

ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ బర్త్ డే విషెస్ తో తనపై ప్రేమ కురిపించినందుకు 'సర్కారు వారి పాట' బ్లాస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వినయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ''సాధ్యమైన అన్ని విధాలుగా నా పట్ల మీ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మరియు ఎల్లప్పుడూ కనెక్ట్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గ్రేట్ ఫుల్ ఎవెరీ డే. ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ. 'సర్కారు వారి పాట' టీజర్‌ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతో మీ అందరినీ అలరించడానికి వేచి ఉండలేకపోతున్నాను. అందరూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాము. ప్రేమ & కృతజ్ఞతతో మీ మహేష్ బాబు'' అని సూపర్ స్టార్ సోషల్ మీడియాలో విడుదల చేసిన లెటర్ ద్వారా తెలిపారు.

ఇకపోతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 20 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిసి ట్విట్టర్ లో బిగ్గెస్ట్ స్పెషల్ స్పేస్ సెషన్ ను ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడటంతో స్టార్ అయిన ఈ స్పేస్ లో ప్రతి ఒక్కరూ మహేష్ గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. శ్రీనువైట్ల - అనిల్ రావిపూడి - వంశీ పైడిపల్లి - పరశురామ్ పెట్లా - సందీప్ రెడ్డి వంగా - గోపీచంద్ మలినేని - బాబీ - మెహర్ రమేష్ - అల్లరి నరేష్ - అడవి శేష్ - సుధీర్ బాబు - మైత్రీ ప్రొడ్యూసర్స్ - 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ - అనిల్ సుంకర - నాగవంశీ - దేవిశ్రీప్రసాద్ - థమన్ - గోపీ మోహన్ - కోన వెంకట్ - బ్రహ్మాజీ వంటి వారు ఈ స్పేస్ లో పాల్గొన్నారు.

కాగా, సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా ట్విట్టర్ దృష్టిని కూడా ఆకర్షించింది. ట్విట్టర్ సెలబ్రిటీల అందరి విషెస్ ను ఒక జాబితాలో పెడుతూ “ట్విట్టర్ మూమెంట్స్” లో ఫీచర్ గా ఉంచింది. ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ 'ట్విట్టర్ మూమెంట్స్ ఇండియా'లో కనిపించిన మొదటి స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయ్యి ఉండొచ్చు.
Tags:    

Similar News