• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తంబి అంటున్న కార్తి.....

తంబి అంటున్న కార్తి.. పవన్ టైటిలేనా?

By - Tupaki Desk
Update: 2019-11-12 06:11 GMT
పాత సినిమాల టైటిల్స్ కొత్త సినిమాలకు పెట్టుకోవడం అనే ట్రెండ్ ఈమధ్య ఊపందుకుంది.  'నర్తనశాల' లాంటి క్లాసిక్ టైటిల్స్ నుంచి.. 'గ్యాంగ్ లీడర్'  లాంటి సూపర్ మాస్ టైటిల్స్ వరకూ మన మేకర్స్ ఏ పాత టైటిల్ ను కూడా వదలడం లేదు.   మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన 'ఖైది' టైటిల్ ను కార్తి తన కొత్త సినిమాకు వాడుకున్న సంగతి తెలిసిందే.  మెగాస్టార్ సినిమాల టైటిల్స్ ఇలా ఇతర హీరోలు వాడుకోవడంపై మెగా ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఉంది.  అయితే హీరోలు మాత్రం వాటిని పట్టించుకోకుండా మెగాస్టార్ టైటిల్స్ ను వాడేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కార్తి మరో మెగా టైటిల్ పై కన్నేసినట్టు ప్రచారం సాగుతోంది.  కార్తి ప్రస్తుతం 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో కార్తి వదినమ్మ జ్యోతిక మరో కీలక పాత్ర పోషిస్తోంది.  ఈ సినిమాలో అక్కగా జ్యోతిక.. తమ్ముడిగా కార్తి నటిస్తారట.  కథకు తగ్గట్టు ఈ సినిమాకు తమిళంలో 'తంబి' అనే టైటిల్ నిర్ణయించారు. తంబి అంటే తెలుగులో తమ్ముడు..  కార్తి సినిమాలు ఎలాగూ తెలుగులో రిలీజ్ అవుతాయి కదా.. అప్పుడు ఈ సినిమాకు ఆటోమేటిక్ గా తమ్ముడు అనే టైటిల్ పెట్టేస్తారు.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'తమ్ముడు'.  ఈమధ్య మెగాస్టార్ టైటిల్ 'ఖైదీ'ని వాడుకున్న కార్తి ఇపుడు పవర్ స్టార్ 'తమ్ముడు' టైటిల్ ను వాడుకుంటాడేమో అనేది ఇపుడు మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  నాని.. కార్తి తరహాలో ఇతర హీరోలు కూడా చిరు.. పవన్ సినిమాల టైటిల్స్ వాడేయడం మొదలు పెడతారనే వాదన వినిపిస్తోంది.
Tags:    
  • Thambi 
  • Karthi 
  • Khaidi 
  • Pawan Kalyan Title 
  • Tammudu 
  • Karthi New Movie Tammudu 
  • Tupaki News 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS