కొత్త అవతారం ఎత్తిన థమన్ సిస్టర్

Update: 2016-02-17 04:01 GMT
కొత్త సింగర్లను పరిచయం చేయడంలో.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కొత్త రికార్డ్ సృష్టించేట్లు ఉన్నాడు. బహుశా ఈ విషయంలో ఏదైనా గిన్నిస్ రికార్డ్ కొట్టాలని ప్లాన్ చేసినట్లున్నాడు తమన్. ఇప్పటికే తెరపై వెలిగే నటులతో పాటలు పాడించేశాడు. తమన్ పాటలు పాడించిన లిస్ట్ లో ఎన్టీఆర్(గతంలోనూ పాడాడులెండి), కాజల్ అగర్వాల్ - హీరోయిన్ అంజలిలు రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు థమన్ సిస్టర్ యామిని కూడా సింగర్ అవతారం ఎత్తేసింది.

ప్రస్తుతం ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యామిని.. చిత్రాంగద చిత్రంలో ఓ పాట పాడింది. ఓ మాంచి రొమాంటిక్ మెలోడీకి కొత్త వాయిస్ ని ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో యామినిని ట్రై చేశారని తెలుస్తోంది. ఈమె వాయిస్ కరెక్ట్ గా సూట్ అవడంతో ఈ మెలోడీని ఆమెతోనే పాడించారట. తమిళ్ లో యార్ నీ, తెలుగులో చిత్రాంగద పేరుతో ఈ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఇది కూడా యాజ్ యూజువల్ గానే లేడీ ఓరియెంటెడ్ హారర్ థ్రిల్లర్ మూవీనే. తండ్రీకొడుకులు సెల్వగణేషన్-స్వామినాథన్ లు ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న చిత్రాంగదకు.. పిల్ల జమీందార్ చిత్రాన్ని తీసిన అశోక్ దర్శకుడు. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరపుతున్న ఈ మూవీని.. సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.
Tags:    

Similar News