వకీల్‌ సాబ్‌ కోసం థమన్‌ నైట్‌ డ్యూటీ

Update: 2021-02-20 10:50 GMT
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా బాలీవుడ్‌ పింక్‌ మూవీ రీమేక్‌ అవుతుంది. షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేశారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ముగింపు దశకు వచ్చింది. సినిమా కు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈయన అందించిన మగువ మగువ పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వకీల్‌ సాబ్‌ సినిమా కోసం థమన్‌ తన టీమ్‌ తో కలిసి రీ రికార్డింగ్‌ పనిలో ఉన్నాడు. వకీల్‌ సాబ్‌ పని ముగించేందుకు డే అండ్ నైట్‌ వర్క్‌ చేస్తున్నట్లుగా థమన్ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

తన ప్రియమైన హార్మోణీ టీమ్‌ తో రాత్రి సమయంలో కూడా వర్క్‌ చేస్తున్నట్లుగా ఈ ఫొటోను షేర్‌ చేసి తెలియజేశారు. టీమ్‌ మెంబర్స్‌ అందరం కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుని వర్క్‌ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. మొత్తానికి వకీల్‌ సాబ్‌ కోసం థమన్‌ కాస్ ఎక్కువ శ్రద్ద పెట్టి వర్క్‌ చేస్తున్నట్లుగా మాత్రం క్లారిటీ ఇచ్చాడు. పింక్ సినిమా లో పాటలు ఏమీ ఉండవు. కాని పవన్‌ అభిమానుల కోసం థమన్‌ తో ఒక మాస్‌ బీట్‌ ను ట్యూన్‌ చేయించినట్లుగా సమాచారం అందుతోంది. పవన్‌ మరియు శృతి హాసన్‌ ల కాంబోలో ఆ పాట ఉంటుందని సమాచారం అందుతోంది.


Tags:    

Similar News