• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో 'దూకుడు' అంటూ థమన్...

మరో 'దూకుడు' అంటూ థమన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2021-05-25 12:30 GMT
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్నట్లుగా సంగీత దర్శకుడు థమన్‌ చెప్పాడు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో సర్కారు వారి పాట గురించి ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ సర్కారు వారి పాట ను పరశురామ్‌ పూర్తి స్థాయి పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్ టైనర్‌ గా రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. థమన్ ఈ సినిమాకు ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

దూకుడు తరహాలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ గా సర్కారు వారి పాట ఉంటుందని థమన్‌ వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఒక పూర్తి స్థాయి కమర్షియల్‌ ప్యాకేజీ మాదిరిగా ఉంటుందని కూడా అంటున్నారు. కామెడీకి కామెడీ.. యాక్షన్‌ కు యాక్షన్‌.. మాస్ సీన్స్ కు మాస్ సీన్స్ అన్నట్లుగా సర్కారు వారి పాట అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ లా ఉంటుందని థమన్ అన్నాడు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్‌ ను ప్రారంభించే సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభనతో షూటింగ్‌ నిలిచి పోయింది.

మే 31న ఈ సినిమా నుండి ఫస్ట్‌ లుక్ లేదా టీజర్‌ వస్తుందని అభిమానులు చాలా నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. టీజర్ కు కరోనా ఎఫెక్ట్‌ పడింది. కృష్ణ బర్త్‌ డే సందర్బంగా టీజర్ విడుదల చేయాలనుకున్నా అది సాధ్యం కావడం లేదని ఫస్ట్‌ లుక్ తో సరి పెట్టబోతున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు పాటల విషయంలో థమన్ చాలా ఫోకస్ పెట్టాడట. గత ఏడాది అల వైకుంఠపురంతో బ్లాక్ బస్టర్‌ హిట్ ఇచ్చిన థమన్‌ సర్కారు వారి పాటతో మరోసారి ఆ హడావుడిని కంటిన్యూ చేయాలని ఆశ పడుతున్నాడు.
Tags:    
  • SS Thaman 
  • Music Director 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS