• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో బైక్...

స్టార్ హీరో బైక్ రైడింగ్.. షాక్ లో ఫ్యాన్స్!

By - Tupaki Desk
Update: 2020-04-21 09:10 GMT
సౌత్ స్టార్ హీరో తలా అజిత్ పేరు వినగానే.. హీరోనే కాదు ఓ బైక్ రేసర్‌ కూడా మనకు గుర్తొస్తాడు. బైక్ రైడింగ్ అంటే ప్రాణంగా ఇష్టపడే అజిత్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రేస్ బైకులపై సవారీ చేస్తుంటారు. ఇటీవల అజిత్ ఏకంగా 650 కిలోమీటర్లు ఒంటరిగా బైక్ రైడ్ చేసి వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు సాగిన ఈ జర్నీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు సక్సెస్ ఫుల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత బాలీవుడ్‌ సూపర్‌ హిట్ పింక్‌ సినిమాను రీమేక్‌ చేసిన అజిత్ మరో హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో హెచ్‌. వినోద్ దర్శకత్వంలో వాలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్‌ డౌన్‌ ముందు వరకు హైదరాబాద్‌ లోనే జరిగింది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారట.

అయితే ఈ చిత్రీకరణలో వాడిన బైక్‌ అజిత్ కి ఎంతో నచ్చటంతో ఆ బైక్‌ మీదే హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు వెళ్లాడట. అయితే ఎవరికీ తెలియకుండా సైలెంట్‌ గా వెళ్ళిపోయిన అజిత్ జర్నీకి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు రావటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 650 కిలోమీటర్లు అజిత్ బైక్‌ మీద ప్రయాణించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ ప్రయాణంలో కేవలం పెట్రోల్ కోసం - ఫుడ్ కోసం మాత్రమే రెండు మూడు సార్లు బ్రేక్‌ తీసుకున్నాడట అజిత్. ఇక సెట్స్‌  మీద ఉన్న వాలిమై సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందట. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట చిత్రయూనిట్‌. కానీ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని కార్యక్రమాలు ఆగిపోవటంతో రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Tags:    
  • Thala Ajith takes 650 Kms ride on Valimai bike 
  • Thala Ajith rides 650 kms on bike to Chennai 
  • Ajith bike ride 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS