ఉగ్రవాదిగా మారిన హిందీ నటుడు ఎన్ కౌంటర్

Update: 2018-12-13 17:55 GMT
హిందీ మూవీ ‘హైదర్‌’ లో హీరో షాహిద్‌ కపూర్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రను సకీబ్‌ బిలాల్‌ అహ్మద్‌ అనే కుర్రాడు పోషించాడు. అందులో అతడి నటనకు మంచి మార్కులు పడటంతో పాటు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో - బుల్లి తెరపై కూడా ఛాన్స్‌ లు దక్కాయి. ఈమద్య కాలంలో అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అంతా అతడి గురించి మర్చి పోతున్న సమయంలో షాకింగ్‌ గా తాజాగా జమ్మూ కాశ్మీర్‌ లో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మృతి చెందాడు.

లష్కరే తోయిబా ఉచ్చులో చిక్కుకున్న సకీబ్‌ బిలాల్‌ కొన్నాళ్ల క్రితం ఉగ్రవాదిగా మారాడట. సినిమాల్లో ఆఫర్లు లేక పోవడంతో పాటు కొందరు చెప్పిన మాటలతో అతడు ఆత్మహుతి దాడులకు సిద్ద పడేందుకు - ఇండియన్‌ ఆర్మీపై దాడికి ట్రైనింగ్‌ తీసుకున్నాడట. తాజాగా కాశ్మీర్‌ లోని బందిపొరా జిల్లాలోని ఒక ఇంట్లో బిలాల్‌ మరో ఉగ్రవాది ఉన్నట్లుగా ఆర్మీ వారికి సమాచారం అందింది.

సమాచారం అందిన వెంటనే ఆ ఇంటిని ఆర్మీ వారు చుట్టు ముట్టి కొన్ని గంటల పాటు కాల్పులు జరిపారు. చివరకు ఆ ఇద్దరిని ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఎన్‌ కౌంటర్‌ లో బిలాల్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బిలాల్‌ అంటూ తెలియగానే బాలీవుడ్‌ వర్గాలు ఒక్కసారిగా షాక్‌ కు గుర్యాయి. బిలాల్‌ తో పాటు ఎన్‌ కౌంటర్‌ అయిన కుర్రాడు అతడి స్నేహితుడుగా చెబుతున్నారు. చనిపోయిన బిలాల్‌  వయస్సు 17 సంవత్సరాలు కాగా, అతడి స్నేహితుడు ముదసిర్‌ అహ్మద్‌ వయస్సు 15 ఏళ్లు మాత్రమేనట. చిన్న వయస్సులోనే వీరు లష్కరే ట్రాప్‌ లో పడి జీవితాలను నాశనం చేసుకున్నారు.

Tags:    

Similar News