`పేట` తెలుగు రైట్స్ ఎంత?
సూపర్ స్టార్ రజనీకాంత్ మానియా పూర్తిగా జీరో అయిపోయిందా? భారతదేశంలోనే అసాధారణ స్టార్‌డమ్ ఉన్న రజనీ దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా వెలిగినా.. ఎందుకీ పరిణామం? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రజనీ ప్రభ తగ్గిందా? ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న ఒక యూనివర్సల్ స్టార్ గ్రిప్ ఇక్కడ పూర్తిగా తగ్గిపోయిందా? ప్రస్తుతం అభిమానుల్లోనూ ఆసక్తికర డిబేట్ ఇది.
రజనీ నటించిన `2.ఓ` ప్రపంచవ్యాప్తంగా 600కోట్లు వసూలు చేసింది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం అంతంత మాత్రమే. బయ్యయర్లకు కొంత వరకూ నష్టాలు తప్పలేదన్న చర్చా సాగింది. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అసాధారణ సినిమా కాబట్టి దానిని రెగ్యులర్ సినిమాల గాటాన కట్టేయలేం. 2.ఓ చిత్రాన్ని సపరేట్ గా చూస్తే, రజనీ నటించిన గత చిత్రాలన్నీ టాలీవుడ్‌లో డిజాస్టర్లుగా నిలిచాయి. దాని ఫలితం కూడా మార్కెట్ వర్గాల్లో రజనీ మానియా పూర్తిగా దిగజారడానికి కారణమైంది.
రజనీ నటించిన `కొచ్చాడయాన్` మొదలు, లింగా, కబాలి, కాలా చిత్రాలు డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం బయ్యర్లలో నమ్మకాన్ని తగ్గించింది. దాని ఫలితం రజనీ నటిస్తున్న ప్రతి సినిమాపైనా పడుతోంది. ఈ సంక్రాంతి బరిలో రిలీజవుతున్నా పేట (పేట్ట-తమిళ్) చిత్రంపైనా ఆ ప్రభావం తీవ్రంగానే పడిందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ రైట్స్ ని నవాబ్, సర్కార్ చిత్రాల నిర్మాత చాలా తక్కువ ధరకు కొనుక్కున్నారని తెలుస్తోంది. పేట రైట్స్ కోసం కేవలం 12కోట్ల లోపు డీల్ కుదిరిందని చెబుతున్నారు. సంక్రాంతి బరిలో బిగ్ రిలీజెస్ ఉండడం కూడా ఇలా దిగజారడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కి ఉన్నది కేవలం రెండు వారాలే అయినా ప్రమోషన్ జీరో అనే చెప్పాలి. అలాగే టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు వినయ విధేయ రామా, కథానాయకుడు, ఎఫ్ 2 నుంచి తీవ్రమైన పోటీని పేట ఎదుర్కోనుంది. క్రేజీ సినిమాలతో పోటీపడుతూ రిలీజవుతున్న `పేట` ఎంతవరకూ వసూళ్లు సాధిస్తుంది? అన్నదానిపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.