తెలుగు నిర్మాత‌ల మండ‌లి సొంత ఓటీటీ?

Update: 2021-06-30 12:43 GMT
రిలీజ్ కాని సినిమాల కోసం త‌మిళ నిర్మాత‌ల మండ‌లి సొంత ఓటీటీ ని సిద్ధం చేస్తోంది.. తెలుగులోనూ రిలీజ్ కాని వాటి కోసం నిర్మాత‌ల మండ‌లి నుంచి ఒక ఓటీటీ పెడ‌తారా?.. ప్ర‌స్తుతం తెలుగు నిర్మాత‌ల్లో హాట్ డిబేట్ ఇది.

తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి తాజా నిర్ణ‌యం ఈ డిబేట్ కి కార‌ణ‌మైంది. 2015- 2021 మధ్య కాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్నవి.. మ‌ధ్య‌లో ఆగిపోయిన‌వి.. లేదా ల్యాబుల్లో వివిధ ద‌శ‌ల్లో ఉండిపోయి రిలీజ్ కానివి అన్నిటినీ క‌లెక్ట్  చేసి సొంత ఓటీటీలో నిర్మాత‌ల మండ‌లి రిలీజ్ చేయించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. ఆ మేర‌కు నిర్మాత‌లంద‌రికీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించి ఈల 28వ తేదీలోపు త‌మ సినిమాల వివ‌రాల్ని సమర్పించాల్సిందిగా కోరింది. డిజిటల్‌- శాటిలైట్‌ హక్కులు విక్రయించని సినిమాలు.. రిలీజ్ కానివాటి వివ‌రాలు చెప్పాల‌ని అంది. మూవీకి సంబంధించిన ఆర్టిస్టులు టెక్నీషియ‌న్ల వివ‌రాలు స‌హా ప్ర‌తిదీ స‌మ‌ర్పించాల‌ని కోరింది. బ్యాన‌ర్ కంపెనీ లెటర్ హెడ్ పై లిఖితపూర్వకంగా వివరాల్ని కోరింది.

తెలుగు చ‌ల‌న‌చిత్ర‌సీమ‌లో ఇలాంటి ప్ర‌య‌త్నం సాగ‌నుందా?  నిర్మాత‌ల మండ‌లి సొంత ఓటీటీ ప్ర‌ణాళిక‌ల్ని రెడీ చేస్తుందా? అన్న‌దానికి క్లారిటీ రావాల్సి ఉంది. మొద‌టి లాక్ డౌన్ అనంత‌రం కొన్ని రిలీజ్ కాని సినిమాల్ని తెలుగు నిర్మాత‌లు ఓటీటీల్లో రిలీజ్ చేయించిన సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న‌ర్త‌న‌శాల ఈ కేట‌గిరీలోనే రిలీజైంది.
Tags:    

Similar News