శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో తెలుగు హీరో..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంతో కదిలిన డ్రగ్స్ డొంక.. పలు సినిమా ఇండస్ట్రీలను చుట్టేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా కన్నడ సినీ పరిశ్రమను ఈ వ్యవహారం కుదిపేసింది. ఈ కేసులో పలువురు నటీనటులు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. తాజాగా ఈ కేసులో ఓ తెలుగు హీరో ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. బెంగళూరు పోలీసులు విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది.
బెంగళూరు డ్రగ్స్ కేసులో శాండల్ వుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు ఉన్నారు. అయితే.. ఆ నిర్మాత తెలుగు హీరో పేరును పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. దీంతో పోలీసులు సదరు యూత్ హీరోను విచారణకు పిలిచారట బెంగళూరు పోలీసులు.
విచారణకు వెళ్లిన సదరు హీరో.. తాను అలాంటి వాడిని కాదని, తన గోడు వెళ్లబోసుకున్నాడట. తాను లగ్జరీ లైఫ్ గడపట్లేదని, తన ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయని తెలిపాడట. ఈఎంఐలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని, అలాంటి తాను డ్రగ్స్ పార్టీలకు ఎలా వెళ్లగలనని ఆవేదన వ్యక్తం చేశాడట.
అయితే.. సదరు నిర్మాతకు ఎందుకు టచ్ లో ఉన్నావని పోలీసులు ప్రశ్నించగా.. కన్నడలో తనను స్టార్ హీరో చేస్తానని ఆ నిర్మాత చెప్పాడని, అందుకే సినిమా ఛాన్సుల కోసం తరచూ ఆయన్ని కలిసేవాడినని చెప్పాడ కుర్ర హీరో. ఇంతకు మించి తనకు అతనితో ఎలాంటి సంబంధమూ లేదని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట.