టిక్కెట్టు బుక్కయితేనే పన్ను.. అదే బెస్ట్‌

Update: 2015-05-23 22:30 GMT
ఆ నలుగురు, థియేటర్ల కబ్జా అనేది ఆల్‌టైమ్‌ హాట్‌ టాపిక్‌. అయితే ఆ టాపిక్‌ కంటే తెలుగు సినిమా విషయంలో దృష్టి పెట్టాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు.. అన్నదాని వెనుక బోలెడన్ని ఇతర విషయాల్ని కూడా పరిగణించాల్సిందే. ఎగ్జిబిటరు కోణంలోనూ కొన్నిటిని ఆలోచించాలి.

ప్రస్తుతం థియేటర్‌లో పన్నులు కట్టే విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తే కొన్ని లూప్‌హోల్స్‌ కూడా కనిపిస్తాయి. అసలు థియేటర్‌కి ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా ఎన్ని సీట్లున్నాయో అన్నిటికీ స్లాబ్‌గా ప్రభుత్వాలకు పన్ను కట్టేయాలన్నది నిబంధన. దీనివల్ల ప్రధానమైన కూడలిలో నిత్యం రద్ధీగా ఉండే థియేటర్ల వరకూ బతకగలుగుతున్నాయి కానీ, అంతగా రష్‌ లేని థియేటర్లు చతికిలబడి షాపింగ్‌ కాంప్లెక్సులు, వెడ్డింగ్‌ మాల్స్‌గా మారిపోతున్నాయి. అలా కాకుండా థియేటర్‌లో ఎన్ని సీట్లు నిండితే అన్నిటికి మాత్రమే పన్ను కట్టే విధానం రావాలి. ఇలాంటి పద్ధతి ఎన్టీఆర్‌ కాలంలో ఉండేది. కాలక్రమంలో ఎగ్జిబిటర్ల చేతిలోంచి సీను ఎటో వెళ్లిపోయింది. దానివల్ల అదే ఎన్టీఆర్‌ టైమ్‌లోనే స్లాబ్‌ సిస్టమ్‌ తీసేశారు.

చిన్న నిర్మాతలు బతకాలంటే పన్ను విధానం మారాలి. చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వాలంటే బుక్కయిన టిక్కెట్లపైనే పన్ను వసూలు చేయాలి. అప్పుడే మేలు జరుగుతుంది. టిక్కెటింగ్‌ వ్యవస్థను ఆన్‌లైన్‌ చేసి, బుక్కయిన టిక్కెట్‌కే పన్ను వేస్తే ప్రభుత్వాలకు పారదర్శకత వస్తుందని కొందరు ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.




Tags:    

Similar News