'బంధువుల అంత్యక్రియలకే వెళ్లడం లేదు.. థియేటర్స్ కి వెళ్తారా?'
కరోనా కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతపడ్డాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధిస్తూ.. సినిమా మరియు టీవీ షూటింగ్ లకు అలాగే థియేటర్స్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ లొకేషన్ లో తెసుకోవాల్సిన వివిధ భద్రతా చర్యల గురించి చెబుతూ కొన్ని గైడ్ లైన్స్ కేంద్రం విడుదల చేసింది. అలాగే థియేటర్స్ లో సీటింగ్ విషయంలో కూడా కొన్ని గైడ్ లైన్స్ ప్రకటించింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ భయం కారణంగా భారీ బడ్జెట్ సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదట. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వస్తేనే.. ధైర్యంగా నటీనటులు సాంకేతిక నిపుణులు షూటింగ్స్ కి వస్తారని.. అప్పటి వరకు ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేదని ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు కూడా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. షూటింగులు తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. కరోనా పరిస్థితిలు చూస్తుంటే పెద్దగా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదని అన్నారట. అయితే సినిమా థియేటర్స్ విషయంలో నెలకొనియున్న అనిశ్చితి వల్ల మేకర్స్ షూటింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తి చూపించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ''మూవీ మేకర్స్ రిస్క్ తీసుకొని షూటింగ్స్ స్టార్ట్ చేసినా.. ఆ సినిమాలని ఎక్కడ రిలీజ్ చేసుకోవాలి? జనాలు తమ దగ్గరి బంధువుల అంత్యక్రియలకు కూడా వెళ్లడం లేదు. అలాంటిది సినిమా థియేటర్స్ కి వారు ఎందుకు వెళతారు?'' అని రామ్ మోహన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది.