ప్లాప్ లేని రికార్డు ఎంత మంది సొంతం!

ఒక సినిమా విజయం సాధించడం ఎంత కష్టమో? వరుసగా విజయాలను అందుకోవడం అంతకంటే కష్టం. ముఖ్యంగా దర్శకులకు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లేని రికార్డు ఉండటం అనేది అరుదైన గౌరవం.;

Update: 2026-04-06 02:30 GMT

ఒక సినిమా విజయం సాధించడం ఎంత కష్టమో? వరుసగా విజయాలను అందుకోవడం అంతకంటే కష్టం. ముఖ్యంగా దర్శకులకు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లేని రికార్డు ఉండటం అనేది అరుదైన గౌరవం. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కొందరు దర్శకులు తమ అపజయమెరుగని ప్రస్థానంతో ఇండస్ట్రీని శాసిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తాజా చిత్రం `ధురందర్: ది రివెంజ్` తో హ్యాట్రిక్ సాధించి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడిగా సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ పేరిట ఉండేది.

`మున్నాభాయ్ ఎంబీబీఎస్` నుండి `సంజు` వరకు ఆయన తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అపజయం లేదని అందరూ భావించారు. అయితే షారుక్ ఖాన్‌తో తెర‌కెక్కించిన `డంకీ` చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో హిరానీ క్లీన్ రికార్డుకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ వరుస విజయాలతో బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా అవతరించారు. అలా బాలీవుడ్ ప‌రంగా వారిద్ద‌రు టాప్ లో ఉన్నారు. సౌత్ సినిమా విషయానికి వస్తే దర్శ ధీరడు రాజమౌళి పేరు మొదటి వరుసలో ఉంటుంది. `స్టూడెంట్ నెం.1` నుండి `ఆర్ ఆర్ ఆర్` వరకు రాజమౌళి ప్రస్థానంలో ఒక్క ప్లాప్ కూడా లేదు.

ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఏకైక భారతీయ దర్శకుడిగా ఎదుగు తున్నారు. రాజమౌళి సినిమా అంటే అది ఖచ్చితంగా బాక్సాఫీస్ వండర్ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో వేసేసారు.

వార‌ణాసి విజ‌యంతో రాజ‌మౌళి రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంద‌ని అంచ‌నా. అలాగే అనిల్ రావిపూడి కూడా తనకంటూ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నారు. `పటాస్` నుంచి మొన్నటి `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` వరకు ఆయన తీసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి.

మాస్ - కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను డీల్ చేయడంలో అనిల్ రావిపూడికి సాటిలేరని నిరూపించుకున్నారు. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుండి దిగిన ప్రశాంత్ నీల్ స‌`ఉగ్రం` నుండి `సలార్` వరకు పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాలతో అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. కోలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న దర్శకుడు అట్లీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. `రాజా రాణి` నుండి షారుక్ ఖాన్ తో చేసిన `జవాన్` వరకు ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే టెక్నికల్ గా వండర్స్ క్రియేట్ చేసే నాగ అశ్విన్ `ఎవడే సుబ్రమణ్యం`, `మహానటి`, క‌ల్కి 2898 ఏడి లాంటి చిత్రాల‌తో దేశంలో గ‌ర్వించ‌దగ్గ ద‌ర్శ‌కుడిగా మారారు.

నాగ అశ్విన్ విజన్ , మేకింగ్ స్టైల్ కు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. వీరంతా కేవ‌లం త‌మ మేథ‌స్సు, ప‌ని త‌నంతో పైకొచ్చిన ద‌ర్శ‌కులు. ఎంచుకుంటోన్న క‌థ‌లు, తీస్తోన్న విధానం వారిని ఆ స్థాయిలో నిల‌బెట్టింది. ఒక సినిమా ప్లాప్ అయితే కెరీర్ తలకిందులయ్యే ఇండస్ట్రీలో వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు సాగ‌డం నిజంగా అభినందనీయం. వీరి సక్సెస్ గ్రాఫ్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News