• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థియేటర్లలోనే తేజ సజ్జా...

థియేటర్లలోనే తేజ సజ్జా 'ఇష్క్'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

By - Tupaki Desk
Update: 2021-07-20 12:43 GMT
'జాంబిరెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా నటించిన తాజా చిత్రం ''ఇష్క్''. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో ప్రియా ప్రకాష్‌ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఎస్‌.ఎస్‌. రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాత్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాతో టాలీవుడ్ లో కంబ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'ఇష్క్' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన చిత్ర యూనిట్.. ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో తేజ సజ్జ - ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉన్నారు. ఇది రొమాంటిక్ పోస్టర్ అయినప్పటికీ.. సినిమా కేవలం రొమాంటిక్ మూవీ మాత్రమే కాదని చిత్ర బృందం చెబుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృభిస్తుండటంతో విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో ఈ నెల 30న రిలీజ్ చేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీంతో పాండమిక్ తర్వాత ప్రేక్షకులకు అలరించడానికి వచ్చే థియేటర్లలోకి వచ్చే ఫస్ట్ సినిమాగా 'ఇష్క్' అవుతుంది.

ఆర్‌.బి.చౌద‌రి సమర్పిస్తున్న 'ఇష్క్' చిత్రాన్ని ఎన్వీ ప్ర‌సాద్‌ - పార‌స్ జైన్‌ - వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ నుంచి విడుదలైన ట్రైలర్ మరియు ప్రోమోలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌ గా పని చేస్తున్నారు.
Tags:    
  • Teja Sajja 
  • Ishq 
  • Release date 
  • Movie News 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS