• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫాంటసీ లవ్ స్టోరీగా తేజ...

ఫాంటసీ లవ్ స్టోరీగా తేజ సజ్జా 'అద్భుతం'

By - Tupaki Desk
Update: 2021-07-01 07:26 GMT
'జాంబీరెడ్డి' సినిమాతో హీరోగా పరిచయమైన తేజ సజ్జా.. వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్‌ బ్యానర్ పై 'ఇష్క్'-'నాట్‌ ఎ లవ్‌ స్టోరీ' సినిమా కంప్లీట్ చేశాడు. ఎస్‌.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హను-మాన్' అనే మరో సినిమా ప్రారంభించాడు. అలానే మల్లిక్ రామ్ డైరెక్షన్ లో ఓ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాడు తేజ. ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

తాజాగా ఈ చిత్రానికి ''అద్భుతం'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ''అద్భుతం'' చిత్రానికి సంబంధించిన ఓ ఆకర్షణీయమైన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. తేజ - శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇది ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా అని తెలుస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే - మాటలు రాస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

మహాతేజ క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. చంద్ర శేఖర్ మొగుల్ల - సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో తులసి - శివాజీ రాజా - సత్య - మిర్చి కిరణ్ - దేవీ ప్రసాద్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'అద్భుతం' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    
  • Teja Sajja 
  • Teja Sajja movies 
  • Zombie Reddy 
  • Ishq Not A Love Story 
  • Adbutham Movie 
  • Adbutham Movie first look 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS