తేజ లైవ్ ఆడిష‌న్స్.. జాక్ పాట్ కొట్టేదెవ‌రు?

Update: 2020-06-10 05:33 GMT
చంద‌మామ కాజ‌ల్ లాంటి అందాల నాయిక‌ను ప‌రిచ‌యం చేసినా.. ఉద‌య్ కిర‌ణ్ .. నితిన్.. న‌వ‌దీప్ లాంటి ట్యాలెంటెడ్ హీరోల్ని పరిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసినా తేజాకే చెల్లింది. ఆయ‌న ఇంకా ఇంకా ఆర్టిస్టుల్ని ప‌రిచ‌యం చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇంత‌కుముందు దర్శకుడు తేజ తన పుట్టినరోజున తన తదుపరి రెండు చిత్రాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాక్షస రాజు రావణసురుడు- అలిమేలు మాంగ వెంకట రమణ వంటి టైటిల్స్ ని ప్రకటించారు. రానా.. గోపిచంద్ లాంటి హీరోల్ని ఎంపిక చేసుకున్నారు. ఏ సినిమాలో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది మాత్రం తేజ వెల్ల‌డించ‌లేదు.

మ‌హమ్మారీ కార‌ణంగా.. ఈ రెండు సినిమాలు కొంత‌ స‌స్పెన్స్ లో ప‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు వీటికి కాస్టింగ్ ఎంపిక చేసేందుకు తేజ సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న తొలిసారిగా టాలీవుడ్‌లో సోషల్ మీడియా ప్లాట్ ‌ఫామ్ ద్వారా పరిశ్రమకు కొత్త ప్రతిభను పరిచయం చేయడానికి లైవ్ ఆడిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హెలో యాప్ ‌లో అప్ ‌లోడ్ చేసిన దరఖాస్తులు మాత్రమే తుది ఆడిషన్ ‌కు తీసుకుంటామ‌ని తెలిపారు.

ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. అయితే ఏ సినిమాలో ఎవ‌రు హీరోగా న‌టిస్తున్నారు?  హీరోయిన్లు ఎవ‌రు? అన్న‌ది కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు. అలాగే కొత్త ట్యాలెంట్ నుంచి ఎవ‌రిని ఎంపిక చేస్తారు?  జాక్ పాట్ ఎవ‌రికి ద‌క్కుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News