ఈసారి ‘నీకు మాత్రమే చెప్తా’నంటున్న తరుణ్‌

Update: 2020-03-13 05:15 GMT
విజయ్‌ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ వంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో నటుడిగా మారిన విషయం తెల్సిందే. మీకు మాత్రమే చెప్తా సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో తరుణ్‌ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దర్శకుడిగా.. నటుడిగా.. రచయితగా ఇప్పటి వరకు పని చేసిన తరుణ్‌ భాస్కర్‌ కొత్త రంగంలో అడుగు పెట్టబోతున్నాడు.

తరుణ్‌ భాస్కర్‌ బుల్లి తెరపై హోస్ట్‌ గా మారబోతున్నాడు. ఈ మద్య కాలంలో టాలీవుడ్‌ స్టార్స్‌ ఎంతో మంది బుల్లి తెరపై హోస్ట్‌ లుగా మారారు. ఇదే క్రమంలో తరుణ్‌ భాస్కర్‌ కూడా హోస్ట్‌ గా మారిపోతున్నాడు. రేపటి నుండి ప్రసారం కాబోతున్న ఒక టాక్‌ షో తో తరుణ్‌ భాస్కర్‌ కొత్త జర్నీని ప్రారంభించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

ఈటీవీ ప్లస్‌ లో ప్రసారం కాబోతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ టాక్‌ షో ద్వారా పలువురు దర్శకుల మనో భావాలు.. వారు సినిమాలు తీస్తున్న సమయంలో పడ్డ కష్టాలు ఎదుర్కొన్న అనుభవాలు హీరోల నుండి వచ్చే అనుభవాలు.. నిర్మాతల నుండి ఎదుర్కొనే సవాళ్లను ఈ షో ద్వారా దర్శకులతో చెప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీకు మాత్రమే చెప్తా సినిమా చేసిన తరుణ్‌ భాస్కర్‌ ఈసారి నీకు మాత్రమే చెప్తా అంటూ బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఈటీవీ ప్లస్‌ లో రేపు రాత్రి 9 గంటలకు మొదటి ఎపిసోడ్‌ ప్రసారం కాబోతుంది.

మొదటి ఎపిసోడ్‌ డైరెక్టర్‌ ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే పలువురితో ఇంటర్వ్యూలు అయ్యాయని.. వరుసగా 15 వారాల పాటు ఈ ఇంటర్వ్యూలు ప్రసారం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరి హోస్ట్‌ గా తరుణ్‌ భాస్కర్‌ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తాడో చూడాలి.
Tags:    

Similar News