• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తాప్సీ మెడ కింద టాట్టూ.....

తాప్సీ మెడ కింద టాట్టూ.. పిచ్చ క్రేజ్!

By - Tupaki Desk
Update: 2016-09-28 04:28 GMT
జనాల ప్రభావం సినిమాల మీద ఎంతుందో కానీ, హీరో హీరోయిన్స్ మెయింటెనెన్స్ ప్రభావం మాత్రం యువతపై చాలానే ఉందని చెప్పొచ్చు. సినిమాల్లో హీరోలు వేసుకునే డ్రెస్లు, హెయిర్ స్టైల్ అన్నింటినీ కుర్రాళ్లు బాగా అబ్జర్వ్ చేసి ఫాలో అవుతుంటారు. ఇదే సమయంలో ఆ సినిమాలో హీరోయిన్స్ వేసే డ్రెస్సులు - వాడే వస్తువులు - హెయిర్ స్టైల్ ఇలాంటి విషయాలపై అమ్మాయిలు ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేది తెలిసిన విషయమే! అయితే.. ఈ మధ్యకాలంలో టాట్టూలపై కూడా యువత ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. తాజాగా పింక్ సినిమాలో తాప్సీ టాట్టూ కూడా ఇప్పుడు ఫుల్ ఫేమస్ అవుతుంది.

సౌత్ లో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా లభించని భారీ విజయం బాలీవుడ్‌ లో దక్కింది తాప్సీకి. ఏమాటకామాట చెప్పుకోవాలంటే.. ఈ సినిమాలో తాప్సీ సాహసోపేతమైన పాత్రలో నటించి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే స్వేచ్చను కోరుకునే క్రమంలో తన స్నేహితురాల్లతో కలిసి ఒక ఇంట్లో అద్దెకుంటూ ఉద్యోగం చేసుకునే అమ్మాయి పాత్రలో నటించిన తాప్సి, అనుకోని పరిస్థితుల్లో వచ్చిన సమస్యల వలయంలో చిక్కుకున్న యువతి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రం కోసం ఆమె పాత్ర స్వభావాన్ని ఆవిష్కరించేలా తాప్సీ మెడ కింద భాగంలో పక్షులు రెక్కలు విప్పి విహంగం చేసేలాంటి టాట్టును పొడిపించుకున్నారు. ఈ టాట్టు బాహ్యప్రంచంలో యువతను విపరీతంగా ఆకర్శించేస్తోందట. ఆమెలా టాట్టు పొడిపించుకోవడానికి యువతులు టాట్టు దుకాణాల్లో బారులు తీరుతున్నారట కూడా.

కాగా సెప్టెంబరు 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన పింక్ చిత్రం ఇప్పటికే భారీ వసూళ్లతో దుసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌ కు ఎంత పేరు వచ్చిందో అంతగా తాప్సీ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tapsee 
  • Tattoo 
  • Pink Movie 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS