కాజ‌ల్ ని లైట్ తీస్కున్న‌ గురూజీ .. కార‌ణం?

Update: 2021-01-05 02:30 GMT
అందాల చంద‌మామ కాజ‌ల్ ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన గురువుగా ద‌ర్శ‌కుడు తేజ సుప‌రిచితం. `ల‌క్ష్మీ క‌ళ్యాణం` అనే చిత్రంతో కాజ‌ల్ డెబ్యూ నాయిక‌గా ఇక్క‌డ అడుగుపెట్టి అటుపై మెగా ఆఫ‌ర్ల‌తో అగ్ర నాయిక హోదాను అందుకుంది. త‌న‌కు ఈ స్థాయి రావ‌డానికి గురూజీ తేజ ఇచ్చిన తొలి అవ‌కాశ‌మే కార‌ణ‌మ‌ని కాజ‌ల్ విశ్వ‌సిస్తుంది. అందుకే ప్ర‌తిసారీ త‌న గురు భ‌క్తిని చాటుకుంటూనే ఉంది. ఇంత‌కుముందు వ‌రుస‌గా తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించింది. అత‌డి కంబ్యాక్ కోసం స్క్రిప్టును కూడా ప‌ట్టించుకోకుండా కొన్ని సినిమాలు చేసి ఫ్లాపులు అందుకుంది.

అయితే అదంతా గ‌తం. వ‌ర్త‌మానంలో గురూజీ తేజ కాజ‌ల్ ని ప‌ట్టించుకుంటున్న‌ట్టు లేదు. అత‌డు ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న రెండు సినిమాల‌కు కాజ‌ల్ ఆప్ష‌న్ కానేకాదు. ఇంత‌కుముందు సీత లో మెయిన్ లీడ్ గా న‌టించిన కాజ‌ల్ ని ఈసారి ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

తేజ త్వరలో `అలివేలు మంగ వెంకటర‌మ‌ణ`‌ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించనున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాజల్ క‌థానాయిక‌గా న‌టించాల్సి ఉంది. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయి. తాజా అప్ ‌డేట్ ప్ర‌కారం.. కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగింది. ఆ స్థానంలోకి తాప్సీకి తేజ ఛాన్సిచ్చార‌ని తెలిసింది.

తాప్సీ దృష్టి ఇటీవ‌ల నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌పైకి మ‌ళ్లింది. దీంతో తేజ సినిమాకి సంత‌కం చేసింద‌ట‌. ఈ చిత్రంలో గోపిచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించాల్సి ఉండ‌గా.. హిందీ న‌టుడితో రీప్లేస్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ప్ర‌స్తుతం తేజ ప్రీ-ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. మ‌రో రెండు నెలల్లో మూవీని ప్రారంభించ‌నున్నారు. ఓవైపు క్రీడాకారుల బ‌యోపిక్ లో న‌టిస్తున్న తాప్సీ తేజ మూవీలో ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తుంది? అన్న‌దానికి మ‌రింత వివ‌రం తెలియాల్సి ఉంది. కాజ‌ల్ ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో బిజీ అయిన సంగ‌తి విధిత‌మే.
Tags:    

Similar News