ఎన్టీఆర్ సినిమా కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ - కొరటాల కాంబోలో వస్తున్న '#NTR30' పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటులు సాంకేతిక నిపుణులను కూడా ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేసారని టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ సినిమా కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ను తీసుకోవాలని కొరటాల శివ ఆలోచిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రూ. 4.50 కోట్లు డిమాండ్ చేసాడని.. నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ప్రస్తుతం #NTR30 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో 'మాస్టర్' చిత్రానికి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన అనిరుధ్.. తెలుగులో ఇంతకముందు 'అజ్ఞాతవాసి' 'గ్యాంగ్ లీడర్' 'జెర్సీ' వంటి సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ చివరకు అతని ప్లేస్ లో థమన్ వచ్చి చేశాడు. ఫైనల్ గా ఇప్పుడు తారక్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం అందుకున్నాడని అంటున్నారు.
కాగా, NTR30 చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. కొరటాల శివ శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ కథ సిద్ధం చేస్తున్నారని టాక్ ఉంది. అంతేకాదు ఇది స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణ మరియు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ పూర్తి చేసిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారని సమాచారం.