ఒక్కో ఎపిసోడ్ కి మిల్కీ అంత గుంజేస్తోందా?

Update: 2020-07-01 06:46 GMT
తెలుగు బుల్లి తెర‌పై యాంకర్లు.. జ‌డ్జీల‌ పారితోషికాల్లో ది బెస్ట్ ఎవ‌రు? అంటే.. మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- నేచుర‌ల్ స్టార్ నానీ- మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు- ఓంకార్- ఝాన్సీ- సుమ‌- రేణు దేశాయ్ .. అంటూ కొన్ని పేర్లు వినిపిస్తుంటాయి. బిగ్ బాస్ ఫ్రాంఛైజీ హోస్ట్ ల‌కు స్టార్ మా భారీ పారితోషికాల్ని ఎర‌వేసింది. బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ కోసం స‌న్నాహకాలు మొద‌లైన వేళ హోస్ట్ ఎవ‌రు?  పారితోషికం రేంజ్ ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇదిలా ఉండ‌గానే.. ఓటీటీ వేదిక‌ల‌పైనా టాక్ షోలు నిర్వ‌హించే హోస్ట్ లుకు భారీ పారితోషికాలు ఇవ్వ‌డం అన్న కాన్సెప్ట్ తాజాగా  తెర‌ పైకి వ‌చ్చింది. ముఖ్యంగా బాస్ అల్లు అర‌వింద్ సొంత ఓటీటీ `ఆహా` కోసం భారీ పారితోషికాల్ని వెద‌జ‌ల్ల‌డం హాట్ టాపిక్ గా మారింది.

`ఆహా` కంటెంట్ విష‌యంలో అర‌వింద్ వంద శాతం సంతృప్తిగా లేరు. అందుకే ఈ వేదిక కోసం కంటెంట్ ఉన్న క‌థలు స్క్రిప్టుల్ని ఎంచుకుని క్రేజీగా వెబ్ సిరీస్ ల‌ను నిర్మించే ప్లాన్ తో ముందుకెళుతున్నారు. స‌బ్ స్క్రైబ‌ర్స్ ని ఆక‌ర్షించేందుకు ర‌క‌ ర‌కాల ప్లాన్స్ వేస్తున్నా కానీ.. ఎందుక‌నో ఇంకా కంటెంట్ వీక్ అన్న టాక్ వ‌ల్ల ఆశించిన ఫ‌లితం రావ‌డం లేదు. ఆ క్ర‌మం లోనే ప్లాన్ బిని తెర‌ పైకి తెచ్చార‌ట‌.

అందాల క‌థానాయిక‌ల్ని బ‌రిలో దించి `ఆహా` రేంజ్ పెంచాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. ఇందులో భాగంగా తొలిగా `100ప‌ర్సంట్ ల‌వ్` క‌థానాయిక త‌మ‌న్నాకి ఛాన్సిచ్చారు. తమన్నా ఆహా కోసం ఓ టాక్ షో చేస్తోంది. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం రూ.8 లక్షల తీసుకోనుందిట‌. ఎపిసోడ్ కి అంత అంటే మొత్తం పూర్త‌య్యేప్ప‌టికి ఓ సినిమా పారితోషికం గుంజేయ‌డం ఖాయం అన్న‌మాట‌. టాక్ షో స‌క్సెసైతే ఆహా ఓటీటీ మిల్కీకి కామ‌ధేనువుగా మారుతుంద‌ని ఫ్యాన్స్ అంచ‌నా వేస్తున్నారు. ఓ వైపు పెద్ద తెర‌.. మ‌రోవైపు డిజిట‌ల్లో త‌మ‌న్నా ఆదాయానికి డోఖా ఉండ‌దన్న‌మాట‌.
Tags:    

Similar News