ప్ర‌పంచ స్థాయికి చేర్చారు.. PC కి మ‌హేష్ కితాబు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `బ్లఫ్` ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-03-03 06:23 GMT

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `బ్లఫ్` ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పీసీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి మహేష్ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమా `వార‌ణాసి` షూటింగ్ తో బిజీగా ఉన్న‌ తరుణంలో మహేష్ ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను రివ్యూ చేయడం విశేషం.

మహేష్ బాబు తన రివ్యూలో ప్రియాంక చోప్రా నటనను `స్వాష్ బక్లింగ్` అని అభివర్ణించారు. అంటే అత్యంత సాహసోపేతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన నటన అని అర్థం. ఈ సినిమాలో ప్రియాంక ఒక సముద్రపు దొంగగా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటం మహేష్‌ను బాగా ఆకట్టుకుంది. స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాల్లో పీసీ చూపిన ఘాడ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ అద్భుతమని కొనియాడారు.

ప్రియాంక చోప్రా వెర్సటాలిటీపైనా ప్ర‌శంస‌లు కురిపించారు. హాలీవుడ్ ప్రాజెక్టులలో భారతీయ నటీమణులు కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాకుండా.. కథను నడిపించే ప్రధాన పాత్రల్లో మెప్పించడం గర్వకారణమని అన్నారు. ఒక తల్లిగా.. యోధురాలిగా ఈ భామ‌ పండించిన భావోద్వేగాలు సినిమాకు ప్రాణప్రతిష్ట చేశాయని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రియాంక ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు పోషించడం భారతీయ సినిమా స్థాయిని పెంచుతోందని ఆయన కితాబు ఇచ్చారు.

కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. గతంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ప్రియాంక చోప్రా నటనను, పనితీరును ప్రశంసించారు. ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా ఉందని.. త‌న‌ ఒక గ్లోబల్ ఐకాన్ అని రాజమౌళి గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారతీయ నటీనటులకు హాలీవుడ్‌లో దారులు వేయడంలో ప్రియాంక కృషి అనన్యసామాన్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ప్రశంసించడంతో, రాజమౌళి-మహేష్ కాంబినేషన్ మూవీ వార‌ణాసిలో కూడా ఇలాంటి హై-లెవల్ యాక్షన్ ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.

ప్రియాంక చోప్రా త‌దుప‌రి క్రిష్ 4లో న‌టిస్తుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో `జీ లే జరా`చిత్రంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పీసీ న‌టిస్తున్న వార‌ణాసి వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.

Tags:    

Similar News