నయనతార న్యూ స్ట్రాటజీ 'బోత్ ఆర్ నాట్ సేమ్'!
నందమూరి బాలకృష్ణ `అఖండ`లో `మీరు చదివింది చట్టం..మేం నమ్మేది ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టు లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది.;
నందమూరి బాలకృష్ణ `అఖండ`లో `మీరు చదివింది చట్టం..మేం నమ్మేది ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టు లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది. బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ని అక్షరాలా పాటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యావరేజ్ రేంజ్ ప్రొడక్షన్ హౌస్..భారీ ప్రొడక్షన్ హౌస్.. నా విషయంలో `బోత్ ఆర్ నాట్ సేమ్` అంటోంది నయన్. ఇంతకీ నయన్ ఫాలో అవుతున్న ఆ స్ట్రాటజీ ఏంటీ?..యావరేజ్ రేంజ్ ప్రొడక్షన్ హౌస్..భారీ ప్రొడక్షన్ హౌస్‌ల విషయంలో నయనతరాత ఏ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. అసలు దీని వెనకున్న అసలు కథేంటన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార స్టార్ హీరోలకు ఏ మాత్రం స్థాయి క్రేజ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకున్న నయన్ ఆ క్రేజ్‌కు తగ్గట్టే సినిమాలని ఎంచుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడు స్టార్ హీరోలతో కలిసి భారీ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఈ విషయంలోనే నయనతార తన పంథాను మార్చుకుని వ్యవహరిస్తోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
ప్రొడక్షన్ కంపనీ, భారీ స్పాన్ ఉన్న మూవీని బట్టి తన పారితోషికం విషయంలో మార్పులు చేస్తోందట. యావరేజ్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఒక రేంజ్‌లో..అదే భారీ నిర్మాణ సంస్థ, సినిమా స్థాయిని బట్టి మరో రేంజ్‌లో పారితోషికం డిమాండ్ చేస్తూ నయనతార సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోందని తెలుస్తోంది. అయితే అన్ని సినిమాల విషయంలో ఈ పద్దతిని ఫాలో కావడం లేదని సినిమా స్థాయిని బట్టే పారితోషికంలో మార్పులు చేస్తోందని తెలిసింది. తెలుగులో ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మెగాస్టార్ మూవీ `శివ శంకరవరప్రసాద్‌గారు`.
ఇందులో చిరకు జోడీగా నయన్ నటించడం తెలిసిందే. అంతేనా.. అందరిని షాక్‌కు గురి చేస్తూ ఈ మూవీ ప్రయోషనల్ వీడియోల్లోనూ నటించింది. ఈ సినిమా విషయంలో నయన్ అంతగా ఇన్వాల్వ్ కావడానికి కారణం పారితోషికం అని తెలిసింది. ఈ సినిమా కోసం నయన్ రూ.6 కోట్లు తీసుకుందట. అందులో భాగంగానే ప్రమోషనల్ కంటెంట్‌లోనూ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిందట. ఇక చిరు సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న నయనతార రాకింగ్ స్టార్ యష్ `టాక్సిక్`కు వచ్చేసరికి ప్లాన్ మార్చేసింది.
సినిమా బడ్జెట్, యష్ కున్న మార్కెట్, సినిమా స్థాయిని బట్టి రూ.12 కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నయనతార ఫాలో అవుతున్న ఈ కొత్త స్ట్రాటజీపై ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి నయనతార నటించిన `టాక్సిక్` మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే రోజు రణ్‌వీర్ సింగ్ `ధురంధర్ 2` కూడా రిలీజ్ అవుతుండటంతో రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.