ద‌ళ‌ప‌తి స్పందించే టైమ్ వ‌చ్చేసిందా?

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ వ్య‌క్తిగత‌ చుట్టూ నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-03-03 06:23 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ వ్య‌క్తిగత‌ చుట్టూ నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్న విష‌యం తెలిసిందే. నాలుగు ద‌శ‌బ్దాల ప్ర‌స్థానంలో హీరోగా ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసిన విజ‌య్ తమిళ‌నాట తిరుగులేని సూప‌ర్ స్టార్ అనిపించుకున్నారు. యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ స్టార్‌గా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసిన విజ‌య్ తండ్రి, ద‌ర్శ‌కుడు ఎస్‌.ఏ. చంద్ర‌శేఖ‌ర్ ప్రోత్సాహంతో త‌మిళ సినిమాల్లోకి ప్ర‌వేశించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆరు సినిమాల్లో న‌టించిన విజ‌య్ తండ్రి డైరెక్ట్ చేస్తూ నిర్మించిన `నాలై తీర్పు` సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు.

అక్క‌డి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. సినిమా సినిమాకు స్టార్‌గా ఎదుగుతూ యూత్‌లో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుని భారీ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నారు. 40 ఏళ్ల సినీ జీవితంలో హిట్‌లు, సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిన ద‌ళ‌ప‌తి క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌ని, సొంతంగా పార్టీ పెట్టి త‌న‌ని ఆద‌రించిన వారికి త‌న వంతు బాధ్య‌త‌గా సేవ చేయాల‌నుకున్నారు. టీవీ్ఏ పార్టీని స్థాపించి త‌మిళ రాజ‌కీయాల్లో ప్రకంప‌ణ‌లు సృష్టిస్తున్నారు.

ఇదే ఆయ‌న రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త జీవితాన్ని వివాదాల్లోకి నెడుతోంది. పార్టీ ప్ర‌క‌టించి నియోజ‌క వ‌ర్గాల వారిగా ప్ర‌చారం మొద‌లు పెట్టిన సంద‌ర్భంలో క‌రూర్ స‌భ‌లో తొక్కీసలాట జ‌రిగి 40 మందికి పైగా జ‌నిపోవ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తూ సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని విజ‌య్ చివ‌రి సినిమాగా `జ‌న నాయ‌గ‌న్‌`తో చేశాడు. దీనిపై రాజ‌కీయ కుట్ర మొద‌లు కావ‌డంతో సెన్సార్ అడ్డంకుల కార‌ణంగా సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌న్న దానిపై క్లారిటీ లేదు.

ఈ స‌మ‌స్య‌ల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న విజ‌య్‌పై ఆయ‌న భార్య సంగీత విడాకుల బాంబ్ వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లా కోర్టులో సంగీత విడాకులు కోరుతూ పిటీష‌న్ దాఖ‌లు చేసి షాక్ ఇచ్చింది. ఆ త‌రువాత త‌న‌యుడు జాస‌న్ విజ‌య్ త‌ల్లిని సంగీత‌ని స‌పోర్ట్ చేస్తూ తండ్రి ఇన్‌స్టా అకౌంట్‌ని అన్ ఫాలో చేయ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో విజ‌య్‌పై ముప్పెట దాడి జ‌రుగుతోంద‌నే చ‌ర్చ‌ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది. కావ‌లానే విజ‌య్ చుట్టూ ఇలా ఉచ్చు బిగిస్తున్నారా?.. విడాకుల వార్త‌ల‌పై విజ‌య్ స్పంద‌నేంటి? అని అంతా ఆరాతీస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ద‌ళ‌ప‌తి విజ‌య్ స్పందించే టైమ్ వ‌చ్చేసింది. మార్చి 4న తంజావూరులో విజ‌య్ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌బోతున్నారు. దీనికి సంబంధించి త‌మిళ‌నాడు పోలీసులు ప‌ర్మీష‌న్ ఇచ్చేశారు. ఈ స‌భ‌లో విజ‌య్ సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డిస్తారా? భార్య సంగీత‌ డైవ‌ర్స్ కోరుతూ కోర్టుని ఆశ్ర‌యించ‌డం, త‌న‌కు హీరోయిన్‌తో సంబంధం ఉంద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం వంటి ఫ్యామిలీ విష‌యాల గురించి విజ‌య్ ఈ స‌భ‌లో మాట్లాడ‌తాడా? అనేది ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News