ఉస్తాద్.. సెట్లోకి ఊహించిన అతిథి!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఓజీ`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప‌వ‌న్ అభిమానుల్లో స‌రికొత్త జోష్‌ని నింపింది.;

Update: 2026-03-03 05:28 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఓజీ`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప‌వ‌న్ అభిమానుల్లో స‌రికొత్త జోష్‌ని నింపింది. చాలా కాలంగా ప‌వ‌న్ నుంచి ఎలాంటి క్యారెక్ట‌ర్ కోసం, ఎలాంటి ప‌వ‌ర్‌ఫుల్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి సినిమాని అందించి అందులోనూ ప‌వ‌న్‌ని మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా ప్ర‌జెంట్ చేయ‌డంతో అబిమానులు పండ‌గ చేసుకున్నారు. భార అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.300 కోట్లు రాబ‌ట్టింది. ఈ మూవీ అందించిన జోష్‌తో ఉన్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో సారి అభిమానుల్ని, సినీ ల‌వ‌ర్స్‌ని ఖుషీ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ కామెడీ డ్రామా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్నారు. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అభిమానుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి, అంచ‌నాలు ఎర్ప‌డ్డాయి.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన `దేఖ్ లేంగే సాలా..`, ఆరా ఆఫ్ ఉస్తాద్‌..` సినిమాపై అంచ‌నాల్ని మ‌రింత‌గా పెచేశాయి. `దేఖ్ లేంగే సాలా..` సాంగ్‌లో వేసిన స్టెప్స్ వింటేజ్ ప‌వన్‌ని గుర్తు చేశాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. శ్రీ‌లీల‌, రాశిఖ‌న్నా హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ మూవీని మార్చి 26న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు ఇప్ప‌టికే టీమ్ మొద‌లు పెట్టేసింది. `ఓజీ` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌`పై ఏర్ప‌డిన అంచ‌నాల‌ని దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే `ఉస్తాద్ సెట్లోకి ఊహించిన అతిథి ఎంట‌రై సంద‌డి చేశారు. ఆయ‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే సెట్లో ఏం జ‌రుగుతోందో.. షూటింగ్ ఎలా జ‌రుగుతోంద‌నే కుతూహ‌లం అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ క‌ల‌గ‌డం సహ‌జ‌మే. ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ డైరెక్ట‌ర్లు కూడా ప‌వ‌న్ సినిమా లొకేష‌న్‌కు వెళ్లాల‌ని చూస్తుంటారు. సెట్లోకి ప్ర‌వేశించి సంద‌డి చేస్తుంటారు. ఇలా సెట్లో ఊహించిన అతిథిగా ఎంట్రీ ఇచ్చే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. ప‌వ‌న్ సినిమా షూటింగ్ అంటే ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా ఆయ‌న సెట్లో ఉండాల్సిందే.

గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల‌కు డైలాగ్‌లతో పాటు స్టోరీ మార్పుల్లోనూ ఆయ‌న క‌లం పెడుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌తో ఉన్న ఆయ‌న సాన్నిహిత్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ చ‌నువు కార‌ణంగానే ప‌వ‌న్ సినిమా క‌థ‌ల్లో త్రివిక్ర‌మ్ జోక్యం చేసుకుంటూ మార్పులు చేస్తుంటార‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఆ సాన్నిహిత్యం వ‌ల్లే ప‌వ‌న్ సినిమా సెట్‌కు త్రివిక్ర‌మ్ వ‌స్తుంటారు. తాజాగా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` సెట్‌లో త్రివిక్ర‌మ్ సంద‌డి చేశారు. దానికి సంబంధించిన స్టిల్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Tags:    

Similar News