• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిల్కీ బ్యూటీ కొత్త...

మిల్కీ బ్యూటీ కొత్త మిష‌న్‌..

By - Tupaki Desk
Update: 2018-08-06 04:01 GMT
ఐటెమ్ నంబ‌ర్ల‌తో కిక్కెక్కించ‌డం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఇప్పుడే కొత్తేం కాదు. ఇదివ‌ర‌కూ తెలుగు - త‌మిళ్‌ లో ప‌లు ఐటెమ్ నంబ‌ర్ల‌లో ఆడిపాడింది. అప్ప‌ట్లో బెల్లంకొండ‌ `అల్లుడు శీను`లో - ఆ త‌ర్వాత‌ ఎన్టీఆర్ `జ‌న‌తా గ్యారేజ్‌`లో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ల‌తో దుమ్ము దులిపేసింది. వీటికి పారితోషికం అంతే భారీగా ముట్ట‌జెప్పారు అమ్మ‌డికి. ప్ర‌స్తుతం మిల్కీ కెరీర్ ప‌రంగా మునుప‌టితో పోలిస్తే నెమ్మ‌దించింద‌నే చెప్పాలి. అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలొస్తున్నాయి త‌ప్ప పూర్తి స్థాయిలో భారీ అవ‌కాశాలేం రావ‌డం లేదు. హిందీలో ఓ రెండు సినిమాలు అంగీక‌రించినా అవి అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతూనే ఉన్నాయి. తెలుగులో క్వీన్ రీమేక్ `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి`లో టైటిల్ పాత్ర పోషిస్తోంది. మెగాస్టార్ `సైరా న‌ర‌సింహారెడ్డి` - విక్ట‌రీ వెంక‌టేష్- వ‌రుణ్ తేజ్‌ ల  `ఎఫ్2`లో ఈ భామ న‌టిస్తోంది.

ఆ క్ర‌మంలోనే త‌మ‌న్నా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి సారించింది. అక్క‌డ అదిరిపోయే ప్యాకేజీని ఆఫ‌ర్ చేస్తే న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా క‌న్న‌డ యువ‌హీరో య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం కెజిఎఫ్‌ లో ఓ ఐటెమ్ నంబ‌ర్‌ లో న‌ర్తించే అవ‌కాశం త‌మ‌న్నా అందుకుంది. వ‌చ్చే వారం ఈ పాట‌ను తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హోంబేల్ పిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌తో పాటు తెలుగు - త‌మిళ్‌ - మ‌ల‌యాళం - హిందీలోనూ రిలీజ్ చేయ‌నున్నారు. 2016లో జాగ్వార్ సినిమాలో ఐటెమ్ నంబ‌ర్‌ లో న‌ర్తించిన త‌మ‌న్నా ఇప్పుడు రెండోసారి క‌న్న‌డిగుల సినిమాలో ఐటెమ్ నంబ‌ర్ చేసేందుకు సంత‌కం చేసింది.

జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ‌ మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు - ముఖ్య‌మంత్రి కుమార స్వామి త‌న‌యుడు అన్న సంగ‌తి తెలిసిందే. య‌శ్ .. హీరో నిఖిల్ గౌడ‌కు క్లోజ్ ఫ్రెండ్‌. బంధుత్వం ఉంది. అంటే మిల్కీ బ్యూటీకి వ‌చ్చిన ఆఫ‌ర్ ఆ రేంజులో ఉంద‌న్న‌మాట‌! ఈ ఐటెమ్ నంబ‌ర్‌ కు మినిమం కోటి వ‌ర‌కూ ఆఫ‌ర్ చేశారన్న మాటా వినిపిస్తోంది.
Tags:    
  • Tamannah Bhatia 
  • item song 
  • KGF 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS