పవన్ కళ్యాణ్ దమ్మున్న హీరో: స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు

Update: 2020-06-10 03:30 GMT
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు దక్షిణ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమన్నాకి ఉన్న క్రేజ్‌తో హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేయించడానికి ముందుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో లక్ష్మిగా ఓ కీలక పాత్రలో మెప్పించిన మిల్కీ బ్యూటీ.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో డాంగ్ డాంగ్ అంటూ ప్రత్యేక గీతంలో ఆడిపాడి అలరించింది. ఇక ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమాలో గోపీచంద్ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కబడ్డీ కోచ్‌గా తమన్నా కనిపించనుందట. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన తమన్నా తాజాగా ‘హలో’ యాప్ నిర్వహించిన లైవ్‌‌లో పాల్గొని.. లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తమన్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు అభిమానులు. దానికి తమన్నా స్పందించి.. "పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న నటుడు. ఆయనతో పనిచేయడానికి అవకాశం వచ్చినప్పుడు తొలిసారి సెట్‌లో నేను నిజంగా చాలా భయపడ్డాను. కానీ ఆయనతో పనిచేసినప్పుడు నాతో ఆయన చాలా కంఫర్ట్‌బుల్‌గా కమ్యునికేట్ అయ్యారు. ఆయన పద్దతి చూసి నేను చాలా ఆనందపడ్డాను. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమా వల్ల పూరి గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా మెమొరబుల్. సెట్‌లో పవన్ కళ్యాణ్ గారితో, పూరి గారితో పనిచేయడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ హ్యాపీగా బదులిచ్చేసింది అమ్మడు. ప్రస్తుతం ఈ లైవ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Tags:    

Similar News