తమన్నా ఏం పొగుడుతోందో!
సినిమాలో కలిసి నటించిన హీరో హీరోయిన్లు ఒకరి గురించి మరొకరు పొగుడుకోవడం మామూలే. 'బాహుబలి' హీరోహీరోయిన్లు కూడా మొదట్నుంచి ఒకరికొకరు గొప్పగా కితాబులిచ్చుకొన్నారు. తను లేకపోతే ఈ సినిమా లేదన్నట్టుగా మాట్లాడుకొన్నారు. అయితే తమన్నా మాత్రం ప్రభాస్ గురించి రెండాకులు ఎక్కువే పొగుడుతోంది. రియల్ హీరో అంటే ప్రభాసే అని చెప్పుకొచ్చింది. నిన్న ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తమన్నా డార్లింగ్ డార్లింగ్... అంటూ ప్రభాస్ జపమే చేసింది.
మొన్నటిదాకా ప్రభాస్ గురించి చెప్పాల్సొస్తే తను నిజంగానే డార్లింగ్ అని పొగిడేది తమన్నా. నిన్న మాత్రం ప్రభాస్ నటన గురించి కూడా గొప్పగా చెప్పుకొచ్చింది. ఎలాంటి పాత్రలు పోషించడంలోనైనా ప్రభాస్‌కి తిరుగులేదని సెలవిచ్చింది. ''మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చిలాంటి అర్బన్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్‌కీ, బాహుబలిలో కనిపించిన ప్రభాస్‌కి ఎక్కడా పోలికే లేదు. ఒక సినిమాకోసం ఆ స్థాయిలో మారిపోయి నటించిన ప్రభాస్‌లాంటి కథానాయకుడిని నేనెక్కడా చూడలేదు. అందుకే ప్రభాస్‌ని రియల్ హీరో అంటా''నని చెప్పుకొచ్చింది. నటన తెలియని హీరోయిన్నో, తొలి అడుగులు వేస్తున్న హీరోయినో ఇలా పొగిడితే లైట్‌గా తీసుకోవచ్చు. కానీ మిల్కీ లాంటి ప్రొఫెషనల్ కథానాయిక ప్రభాస్‌ని పొగిడిందంటే గ్రేటే! నిజంగానే బాహుబలి ట్రైలర్‌లో ప్రభాస్‌ని చూసినవాళ్లు ఆయన్ని పొగడకుండా ఎవ్వరూ ఉండలేరేమో!