నా డ్రీమ్ బాహుబ‌లి ముందు చిన్న‌బోయింది

Update: 2015-10-17 07:30 GMT
తెలుగమ్మాయి కాక‌పోయినా తెలుగు బాగా మాట్లాడేస్తుంది త‌మ‌న్నా. ముంబై నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల్లో ప‌ట్టుద‌ల‌గా తెలుగు నేర్చుకుని తెలుగింటి అమ్మాయిలా మారిపోయిన మిల్కీ వైట్ బ్యూటీ .. తెలుగువారితో ఎప్పుడో ప్రేమ‌లో ప‌డి పోయింది. ఇక్క‌డ త‌న‌కి ద‌క్కిన ఆద‌ర‌ణకు మురిసిపోతూ తెలుగులోనే మాట్లాడుతూ గుండెల్లో నిదుర‌పోతోంది.

ఇటీవ‌లే జ‌క్క‌న్న తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంతో ఓ భారీ విజ‌యాన్ని అందుకుంది. త‌న కెరీర్‌ని డిఫైన్ చేయ‌మంటే బాహుబ‌లి త‌ర్వాత -బాహుబ‌లి ముందు అన్నంత‌గా స‌న్నివేశం మారిపోయింద‌ని చెబుతోంది. అంత‌కంటే ముందే నాకు డ్రీమ్ ఉండేది. అయితే బాహుబ‌లి ముందు అది వెల‌వెల‌బోయింది. ఈ చిత్రంతో నాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది అని చెప్పింది. ఇప్పుడు నా క‌ల మారింది. మునుప‌టి కంటే పెద్ద‌గా ఉంది అని చెప్పింది. ఓ వైపు తెలుగు, మ‌రోవైపు త‌మిళ సినిమాల్లో న‌టిస్తూ ముక్క‌లాట ఆడుతున్న ఈ అమ్మ‌డు...ప్ర‌స్తుతం త‌మిళ్‌ లో తోడా అనే చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో బెంగాళ్ టైగ‌ర్‌, ఊపిరి చిత్రాల్లో న‌టిస్తున్నాన‌ని చెప్పింది.

అన్న‌ట్టు బాహుబ‌లి చిత్రం త‌ర్వాత జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ అమ్మ‌డికి మ‌రో ఛాన్స్ ఉంటుందా?  బాహుబ‌లి 2లో త‌మ్మూ క్యారెక్ట‌ర్ ఏమిటి?  పార్ట్ 1లో క్యారెక్ట‌ర్‌ కి ఎక్స్‌ టెన్స‌న్ క‌నిపిస్తుందా? ఎన్ని నిమిషాల నిడివి క‌నిపిస్తుంది? ఇలాంటివాటికి స‌మాధానాలు మాత్రం చెప్ప‌లేదు అమ్మ‌డు!
Tags:    

Similar News