మిల్కీ భుజం మీద ఆ పుర్రెలేంటో..

Update: 2016-05-28 15:01 GMT
ఏదో విక్రమార్కుడు చెట్టు మీద నుండి భేతాళుడిని దించి తన భుజం మీద వేసుకున్నట్లు.. లేకపోతే వాన్ హెల్సింగ్‌ సినిమాలో డ్రాక్యులా పిల్లలను మన హీరో వెంటనే తెచ్చుకున్నట్లు.. అదేంటో ఆ డ్రస్సు.. కాని మిల్కీ మాత్రం సెగలు రేపడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ముంబాయ్‌ లోనే సమ్మర్ బ్రేక్‌ తీసుకుంటున్న తమన్నా.. ఇప్పుడక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇవాళ స్పెషల్‌ ఏంటంటే.. అమ్మడికి రోజూ మేకప్ చేసే బిల్లీ మానిక్ అనే ఆవిడ.. ముంబయ్‌ లో ''ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌'' అనే మేకప్ అకడామీ ఓపెన్ చేసింది. ఈ ఫంక్షన్‌ ను హాజరైన మిల్కీ.. ఏదో ఎర్రటి సింగిల్‌ పీస్‌ డ్రస్ ఒకటి వేసుకొని వచ్చింది. డ్రస్సంతా ఒకెత్తయితే.. భుజం మీద ఆ పుర్రె బొమ్మలు ఒకెత్తు.

ఏదో అగ్గిపెట్టె మీద.. పెట్రోల్‌ ట్యాంకర్‌ మీద.. ముట్టుకుంటే ప్రమాదం అన్నట్లు.. ఎర్రటి డ్రస్సులో తెల్లటి పుర్రె బొమ్మ. అంటే నాతో పెట్టుకోవద్దు అంటూ మిల్కీ వార్నింగ్ ఇస్తోందా ఏంటి?
Tags:    

Similar News