సరిలేరు సాంగ్ లో తమన్నా లుక్ ఇదే

Update: 2019-12-11 05:35 GMT
వరస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయం 'టీజర్' తో అందరికీ అర్థం అయింది. ఇక ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేస్తోందనే సంగతి తెలిసిందే. ఈమధ్యే ఈ పాటను చిత్రీకరించారట.

ఈ పాట లో తమన్నా లుక్ బయటకు వచ్చింది. ఈ ఫోటోలో తమన్నా ఒక మిలిటరీ యూనిఫాం లో కనిపిస్తోంది. మిలిటరీ గ్రీన్ ప్యాంట్.. షర్టు.. పైనేమో ఒక గ్రే కలర్ జాకెట్ ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. సహజంగా హీరో ఇంట్రో సాంగ్ లో హీరోయిన్లు అందమైన డ్రెస్సులు ధరించి ఆడిపాడుతుంటారు. అయితే ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు కదా.. అందుకే తమన్నాను కూడా ఆర్మీ అధికారిలాగే చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. అంతే కాకుండా గ్లామరస్ మేకప్ లేకుండా సహజంగా కనిపిస్తోంది మిల్కీ బ్యూటీ. మరి ఈ పాట తో ప్రేక్షకులను తమన్నా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కానున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రకాష్ రాజ్.. విజయశాంతి.. రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Tags:    

Similar News