మిల్కీ సైజులు పెరుగుతున్నాయ్!!

Update: 2016-05-21 11:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా మంచి జోష్ లోనే ఉంది. కౌంట్ పరంగా చేతిలో ఎక్కువ సినిమాలు లేకపోయినా.. బాహుబలి నుంచి ఊపిరి వరకు వరుసగా హిట్స్ కొట్టడంతో హ్యాపీగా ఉంది తమ్మూ. ప్రస్తుతం బాహుబలి2 తో పాటు.. అభినేత్రి చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తోంది తమన్నా.

మిల్కీ మొదటిసారిగా చేస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ అభినేత్రి. ఈ సినిమాలో ప్రభుదేవా - సోనూ సూద్ - అమీ జాక్సన్ లు కూడా ఉన్నా... తమన్నా కేరక్టర్ ప్రధానం. పైగా మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ పాత్ర కోసం కొంత బరువు పెరగాలని నిర్ణయించుకుందిట తమ్మూ. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పాత్రలో వేరియేషన్ చూపించాల్సిన అవసరం ఉండడంతో.. ఇలా తన పర్సనాలిటీని కూడా మార్చుకునేందుకు తమన్నా సిద్ధమయింది అంటున్నారు.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి సేమ్ లుక్ తో అదరగొడుతున్న తమన్నా.. తొలిసారిగా మార్పు చూపించేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఇదే  సమయంలో బాహుబలి 2 లాంటి ఇతర చిత్రాలపై ఈ పర్సనాలిటీ ఛేంజ్ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోందట. తమ్మూ తెలివే తెలివి. అటు పనవ్వాలి. ఇటు ఏ సమస్యా రాకూడదు. అంతే కదా.
Tags:    

Similar News