• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుండ బద్దలు కొట్టేసిన...

కుండ బద్దలు కొట్టేసిన తాప్సి

By - Tupaki Desk
Update: 2019-06-10 13:14 GMT
టాలీవుడ్‌ లో తాప్సిని రాఘవేంద్ర రావు హీరోయిన్‌ గా పరిచయం చేసిన విషయం తెల్సిందే. మంచు హీరో మనోజ్‌ సరసన 'ఝుమ్మంది నాధం' చిత్రంలో తాప్సి హీరోయిన్‌ గా నటించింది.  తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా సక్సెస్‌ లు దక్కలేదు. స్టార్‌ హీరోయిన్‌ గా మాత్రం ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకోలేక పోయింది. టాలీవుడ్‌ లో ఈ అమ్మడు మంచి సినిమాలే చేసినా కూడా అదృష్టం బాగాలేక పోవడంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్‌ కు వెళ్లిన తాప్సి అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా గేమ్‌ ఓవర్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా తాప్సి తన కెరీర్‌ గురించి కుండ బద్దలు కొట్టినట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. బాలీవుడ్‌ లో తనను ఎవరు కూడా గ్లామర్‌ పాత్రలో చూడాలనుకోవడం లేదు. గ్లామర్‌ పాత్రలో నటించాలని నేననుకున్నా కూడా ఎవరు నన్ను కమర్షియల్‌ పాత్రల కోసం ఎంపిక చేసుకోవడం లేదని తాప్సి వాపోయింది. తనను కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలకే తీసుకుంటున్నారు. కమర్షియల్‌ పాత్రలు చేసేందుకు బాలీవుడ్‌ లో చాలా మంది హీరోయిన్స్‌ ఉన్నారు. అలాంటప్పుడు ఆఫర్లు నాకు రావడం లేదని నేనేం బాధపడను.

నాకు సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా ఏమీ రావడం లేదు. నాకు వస్తున్న ఒకటి రెండు ఆఫర్లు కూడా మంచి ఆఫర్లే అవ్వడంతో సెలక్ట్‌ చేసుకునే అవకాశం లేకుండానే మంచి పాత్రలు వస్తున్నాయి. నన్ను సంప్రదిస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సౌత్‌ లో నాకు చాలా తక్కువ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదంది. అయినా కూడా నటిగానే కొనసాగలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. పెళ్లి కావాలి.. పిల్లలు కావాలని అనిపిస్తుంది కాని ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా అవకాశాలు వచ్చినన్ని రోజులు నటిస్తూనే ఉంటాను అంది. ఇదే సమయంలో హీరోయిన్‌ గా అవకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కెరీర్‌ ఆరంభం నుండి కూడా అడపా దడపా ఆఫర్లతోనే నెట్టుకు వస్తున్న తాప్సి ఇదే తరహాలో కెరీర్‌ కు స్వస్థి చెప్పాలి వస్తుందేమో..!
Tags:    
  • Taapsee Pannu 
  • Game Over 
  • Latest News 
  • Telugu News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS